వాషింగ్ట‌న్ : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ హెలికాప్ట‌ర్‌ కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈవో స‌హా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

వాషింగ్ట‌న్ : అమెరికాలోని కాలిఫోర్నియా - నెవ‌డా స‌రిహ‌ద్దుల్లో ఓ హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక లోపం ఏర్ప‌డి కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో నైజీరియాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ సీఈవో స‌హా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

నైజీరియాకు చెందిన యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బ‌ర్ట్ విగ్వే త‌న భార్య‌, కుమారుడు, మ‌రికొంద‌రితో క‌లిసి యూరోకాప్ట‌ర్ ఈసీ 130లో మోజువా ఏడారిపై ప్ర‌యాణిస్తుండ‌గా శాన్ బ్రెనార్డివో కౌంటీ వ‌ద్ద కుప్ప‌కూలింది. దాదాపు 3 వేల అడుగుల ఎత్తు నుంచి అది కూలిపోవ‌డంతో.. అందులో ఉన్న‌వారంతా ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో నైజీరియాకు చెందిన ఎన్‌జీఎక్స్ గ్రూపు మాజీ చైర్మ‌న్ అబింబోలా, ఇద్ద‌రు పైల‌ట్లు కూడా ఉన్నారు. యాక్సెస్ బ్యాంకు సీఈవో హెర్బ‌ర్ట్ విగ్వే మృతి.. ఆఫ్రికా బ్యాంకింగ్ రంగానికి పెద్ద షాక్ అని వ‌ర‌ల్డ్ ట్రేడ్ ఆర్గ‌నైజేష‌న్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎవాలా ట్వీట్ చేశారు. నైజీరియా యాక్సెస్ బ్యాంకు ఆఫ్రికాలోని ప‌లు దేశాల్లో సేవ‌లందిస్తోంది.

sahasra

sahasra

Next Story