REMI LUCIDI | 68వ అంతస్తు నుంచి కిందపడి మరణించిన సాహస వీరుడు..
REMI LUCIDI | విధాత: ఒళ్లు గగుర్పొడిచే సాహస కృత్యాలు చేస్తు ప్రసిద్ధి చెందిన రెమి ల్యుసిడీ (30) అనే ఔత్సాహికుడు అలాంటి ఓ సాహసం చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ (Hongkong)లోని ఒక బహుళ అంతస్తుల భవనాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. 68వ అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. హాంకాంగ్‌లో ఉన్న ట్రెంగుటర్ టవర్ కాంప్లెక్స్‌ను ల్యుసిడీ స్పైడర్ మ్యాన్‌లా ఎక్కుతూ ఉండగా.. కాలు పట్టు తప్పి కింద పడిపోయాడని […]

REMI LUCIDI |
విధాత: ఒళ్లు గగుర్పొడిచే సాహస కృత్యాలు చేస్తు ప్రసిద్ధి చెందిన రెమి ల్యుసిడీ (30) అనే ఔత్సాహికుడు అలాంటి ఓ సాహసం చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ (Hongkong)లోని ఒక బహుళ అంతస్తుల భవనాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. 68వ అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. హాంకాంగ్‌లో ఉన్న ట్రెంగుటర్ టవర్ కాంప్లెక్స్‌ను ల్యుసిడీ స్పైడర్ మ్యాన్‌లా ఎక్కుతూ ఉండగా.. కాలు పట్టు తప్పి కింద పడిపోయాడని సౌత్ చైనా పోస్ట్ కథనం వెల్లడించింది.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు అతడు ఈ బిల్డింగ్‌కు వచ్చినట్లు సెక్యూరిటీ గార్డులు పోలీసులకు తెలిపారు. 40వ అంతస్తులో ఉన్న తన స్నేహితుడ్ని కలవడానికి వచ్చానని ఓ వ్యక్తి పేరు చెప్పి లోపలికి వెళ్లాడు. అయితే సెక్యురిటీ గార్డులు అతడు చెప్పింది అబద్ధమని తెలుసుకునే సరికే ల్యుసిడీ లోపలకు వెళ్లిపోయాడు.
49వ అంతస్తు వరకు లిఫ్ట్‌లో వెళ్లిన తర్వాత అతడు మెట్ల మార్గంలో బిల్డింగ్ పైకి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో నమోదయింది. అక్కడికి వెళ్లి చూసిన వారికి అతడి జాడ కనిపించలేదు. అయితే 7.38 గంటలకు అతడు పెంట్ హౌస్ కిటికీ తలుపు కొట్టాడని అందులో ఉన్న పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బిల్డింగ్ నుంచి కాళ్లు చేతులు ఉపయోగించి ఎక్కడానికో దిగడానికో ప్రయత్నించిన ల్యూసిడ్.. ఆ పెంట్ హౌస్ కిటికీ వద్ద పట్టు తప్పి ఉంటాడని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అందుకే సాయం కోసం ఆ కిటికీ తలుపును కొట్టి ఉంటాడని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ల్యూసిడ్ కెమెరాను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో అతడు చేసిన ప్రమాదకర స్టంట్‌ల వీడియోలను గుర్తించారు.