వీడియో : కెనడాలో హిందూ ఆలయం, భక్తులపై ఖలిస్థానీల దాడి ‌‌– పలువురికి గాయాలు

కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. కెనడాలోని ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆలయం వద్ద భక్తులపై దాడులు చేశారు. దీనిపై అక్కడ అన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి.

వీడియో : కెనడాలో హిందూ ఆలయం, భక్తులపై ఖలిస్థానీల దాడి ‌‌– పలువురికి గాయాలు

Khalistani Attack | ఒట్టావా: బ్రాంప్టన్‌(Brampton)లోని హిందూ సభ మందిర్​ (Hindu Sabha Mandir) దేవాలయం దగ్గర ఖలిస్తానీ తీవ్రవాదుల(Khalistani Extremists) నిరసన హింసాత్మకంగా మారింది. దేవాలయానికి వచ్చిన భక్తులపై(Devotees) ఖలిస్థానీలు దాడికి దిగారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. వివిధ పార్టీల నాయకులు, ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau)తో సహా తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రజలకు తమ తమ మతవిశ్వాసలను పాటించే హక్కు ఉందనీ, దాన్ని కాపాడటం మా విధి అని ఆయన స్పష్టం చేసారు.. ఈనేపథ్యంలో బ్రాంప్టన్‌లోని ఆలయం వద్ద పీల్​ పోలీసులు భారీగా భద్రతా దళాలను మోహరించారు.

కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో(Attack Video) వైరల్‌గా మారింది. భక్తులను ఖలిస్థానీలు కర్రలతో బాదుతున్న ఈ వీడియో సంచలనం సృష్టించింది. పోలీసులు తాము ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదంటూ, కారణాలు మాత్రం చెప్పలేకపోయారు.

మరోవైపు కెనడా ఎంపీ చంద్ర ఆర్య(Chandra Arya) స్పందిస్తూ కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెబుతోందన్నారు. ఖలిస్థానీలు గీత దాటారని తన ఎక్స్​ అకౌంట్​లో ఆయన ఓ పోస్ట్​ చేసారు. కెనడా హిందువులు(Canadian Hindus) ధైర్యంగా తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. కెనడాలో తీవ్రవాద శక్తులు రాజకీయాల్లోకి, శాంతిభద్రతా విభాగాల్లోకి కూడా చొరబడ్డాయని ,చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.

ఎంపీ కెవిన్‌ వూంగ్‌(Kevin Vuong) స్పందిస్తూ తీవ్రవాదులకు కెనడా సురక్షిత ప్రదేశం(safe harbour)గా మారిందని అన్న ఆయన క్రిస్టియన్లు, యూదులను రక్షించడంలో మన నాయకులు విఫలమైనట్లు ఇప్పుడు హిందువులను కాపాడ్డంలో కూడా విఫలమయ్యారని అని పేర్కొన్నారు.

ఈ దాడులకు తెగబడిన వారిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకొంటామని బ్రాంప్టన్‌ మేయర్‌ పాట్రిక్‌ బ్రౌన్‌(Patrick Brown) హామీ ఇచ్చారు. మత స్వేచ్ఛ(Religious Freedom) అనేది కెనడా మౌలిక విలువలకు చిహ్నమని పేర్కొన్నారు. ఒంటారియో సిఖ్స్‌ అండ్‌ గురుద్వారా కౌన్సిల్‌(Ontario Sikhs & Gurudwara Council) కూడా ఈ హింసను ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది. హింసకు తమ మతంలో స్థానంలో లేదని పేర్కొంది.

కాగా, కెనడాలోని హిందూ సమాజం కోసం పనిచేస్తున్న హిందూ కెనడియన్ ఫౌండేషన్(Hindu Canadian Foudation) అనే స్వచ్ఛంద సంస్థ, ఆలయంపై దాడికి సంబంధించిన వీడియో(Video)ను షేర్​ చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాదులు స్త్రీలు, పిల్లలపై కూడా కర్రలతో దాడి చేసారని వివరించింది.

ఈ ఘటనపై భారత్​(India) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముందుగా చెప్పినట్లుగానే భారత ప్రజలు, హిందువుల పట్ల దాడులు జరిగే అవకాశముందని, అలాంటి చోట్ల భద్రతను పెంచాల్సిందిగా తాము కెనడా ప్రభుత్వాన్ని కోరామని, భారత దౌత్య కార్యాలయం తెలిపింది. ఇప్పటికైనా కెనడా ప్రభుత్వం కళ్లుతెరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరింది.