YS Bhaskar Reddy | వైఎస్ భాస్క‌ర్ రెడ్డికి.. 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్

YS Bhaskar Reddy | విధాత‌, హైద‌రాబాద్: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన‌ వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం 12 రోజుల మధ్యంతర బెయిల్‌కు అనుమతిచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం భాస్క‌ర్‌రెడ్డికి సెప్టెంబ‌ర్ 22న ఉదయం 10 గంటల నుంచి అక్టోబ‌ర్ 3వ తేదీ ఉదయం 10.30 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే ఈ 12 రోజులు నగరం విడిచి వెళ్లకూడదని […]

  • By: krs    latest    Sep 20, 2023 4:13 PM IST
YS Bhaskar Reddy | వైఎస్ భాస్క‌ర్ రెడ్డికి.. 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్

YS Bhaskar Reddy |

విధాత‌, హైద‌రాబాద్: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన‌ వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి హైదరాబాద్‌ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం 12 రోజుల మధ్యంతర బెయిల్‌కు అనుమతిచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం భాస్క‌ర్‌రెడ్డికి సెప్టెంబ‌ర్ 22న ఉదయం 10 గంటల నుంచి అక్టోబ‌ర్ 3వ తేదీ ఉదయం 10.30 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

హైదరాబాద్‌లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతిచ్చింది. అయితే ఈ 12 రోజులు నగరం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో ఎస్కార్ట్‌ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

ఈ నెల 22న భాస్కర్‌రెడ్డిని ఎస్కార్ట్‌ పోలీసులకు అప్పగించాలంది. అలాగే వచ్చే నెల 3న ఎస్కార్‌ పోలీసులు జైలు సిబ్బందికి తిరిగి అత‌న్ని అప్పగించాలని స్పష్టం చేసింది.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి ప్రత్యేక సీబీఐ కోర్టులో ఈనెల 9న పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు ముగియడంతో సీబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది.