Raigarh | మట్టి దిబ్బల కింద 16 మంది మృతి.. 119 మంది గల్లంతు
Raigarh ఇప్పటివరకు ఇంకా 119 మంది గల్లంతు రెండోరోజు కొనసాగుతున్న సహాయ చర్యలు రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి విరిగిపడిన కొండచరియలు విధాత: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. ఇంకా 119 మంది గల్లంతయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అక్కడ రెండో రోజైన శుక్రవారం కూడా ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఇక్కడే ఉండి సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ముంబైకి సుమారు 80 కిలోమీటర్ల […]

Raigarh
- ఇప్పటివరకు ఇంకా 119 మంది గల్లంతు
- రెండోరోజు కొనసాగుతున్న సహాయ చర్యలు
- రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి గ్రామంలో
- బుధవారం అర్ధరాత్రి విరిగిపడిన కొండచరియలు
విధాత: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. ఇంకా 119 మంది గల్లంతయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అక్కడ రెండో రోజైన శుక్రవారం కూడా ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఇక్కడే ఉండి సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ముంబైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఖలపూర్ తహసిల్‌లోని ఇర్షాల్‌వాడి గిరిజన గ్రామం గుట్ట కింద ఏర్పాటైంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు బుధవారం అర్థరాత్రి కొండచరియలు విరిగి గ్రామంలోని ఇండ్లపై పడ్డాయి. అనేక ఇండ్లు మట్టిదిబ్బల కింద చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు.
#WATCH | #Raigad: Canine squad carries out search operation in landslide-hit area.
(ANI) pic.twitter.com/1hW5OUkfVf
— TOI Mumbai (@TOIMumbai) July 21, 2023
గ్రామంలో మొత్తం 228 మంది గ్రామస్థులు ఉన్నాయి. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు. 93 మందిని గుర్తించారు. ఇంకా 119 మంది గ్రామస్థుల ఆచూకీ శుక్రవారం వరకు కూడా లభించలేదు. గ్రామంలో మొత్తం 50 ఇండ్లు ఉండగా, 19 ఇండ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు, రాయ్‌గఢ్ పోలీసులు, స్థానికులు గాలింపు, సహాయ చర్యలను చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు సహాయచర్యలు మొదలయ్యాయి. నాలుగేండ్లలోపు నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. అలాగే వృద్ధుడి మృతదేహాన్ని కూడా మట్టిపెల్లల నుంచి బయటకు తీశారు. గాయపడిన ఏడుగురి చికిత్స నిమిత్తం వివిధ దవాఖానలకు తరలించారు.