‘ధరణి’ రద్దు చేయండి.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలిపిన కాంగ్రెస్ విధాత: ధరణి పోర్టల్‌ను రద్దు చేయండి.. టైటిల్ గ్యారెంటీ చట్టాన్నితీసుకురండి అన్న ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నిమండలకేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి, తాసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలోపీసీసీ, డీసీసీనాయకులు, మాజీ మంత్రుల, ఎమ్మల్ల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ […]

- టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని తీసుకురండి
- రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలిపిన కాంగ్రెస్
విధాత: ధరణి పోర్టల్‌ను రద్దు చేయండి.. టైటిల్ గ్యారెంటీ చట్టాన్నితీసుకురండి అన్న ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నిమండలకేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి, తాసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలోపీసీసీ, డీసీసీనాయకులు, మాజీ మంత్రుల, ఎమ్మల్ల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్ననేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలన అనేకమంది రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. రైతులు వారి భూములు పట్టాలు కాక ధరణి పోర్టల్ వలన రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికిని ఇంతవరకు రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు. దీంతో బ్యాంకర్లు రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ముక్కు పిండి రుణాలు వసూలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ చేసిన ప్రధాన డిమాండ్లు ఇవే…
1. ధరణి వెబ్సైట్ పేరుతో రికార్డులను నిర్వహించే బాధ్యత ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నిజాం కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు భూమి రికార్డుల నిర్వహణ పూర్తిగా సి సి ఎల్ ఏ (చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ఆధీనంలో ఉండేది. ఇప్పుడు కూడా పూర్వం విధానాన్ని అమలు చేయాలి, ధరణిని పూర్తిగా రద్దు చేయాలి.
2. నిషేధిత జాబితాలో ఉంచిన ప్రతి గుంట భూమిని కూడ జాబితా నుంచి తొలగించి గ్రామపంచాయతీ సభలో ఆయా గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చేయాలి.
3. అటవీ భూములు 2006 సంవత్సరంలో తెచ్చిన అటవీ భూముల హక్కు చట్టం ప్రకారం అందరికీ భూమి హక్కు కల్పించాలి.
4. కాంగ్రెస్ హయాంలో పేదలకు అసైన్డ్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారులకు ఉండే హక్కుకు సమానంగా అసైన్డ్ భూములకు కూడా హక్కు కల్పించాలి. ఆ విధంగా చట్ట సవరణ చేయాలి.
5. ప్రతి ఏటా రెండు పంటలకు భూములు కౌలు చేసుకునే రైతులకు హక్కు కలిగించే విధంగా గ్రామస్థాయిలో కౌలు రైతులను గుర్తించాలి. ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థ తీసుకురావాలి. అదే విధంగా పట్టా భూమి యజమానికి ఏ విధమైన చట్టపరమైన ఇబ్బందులు రాకుండా చూడాలి.
6. 2004 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన పాలసీని అమలు చేయడానికి ప్రతి ఎకరం సర్వే చేసి రైతుల భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించి, రాష్ట్ర శాసనసభలో వెంటనే భూమి టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలి.