Adilabad | KCR.. రాష్ట్రానికి పట్టిన కొరివి దయ్యం: రేవంత్ రెడ్డి

Adilabad కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల‌ని డిమాండ్‌ నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది విద్యార్థులు పోరాడి అమరులైతే, వారి త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ విద్యార్థుల పాలిట కొరివి దయ్యం లాగా తయ్యారయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విధాత, ప్రతినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ […]

Adilabad | KCR.. రాష్ట్రానికి పట్టిన కొరివి దయ్యం: రేవంత్ రెడ్డి

Adilabad

  • కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల‌ని డిమాండ్‌

నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది విద్యార్థులు పోరాడి అమరులైతే, వారి త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ విద్యార్థుల పాలిట కొరివి దయ్యం లాగా తయ్యారయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

విధాత, ప్రతినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

అవినీతికి పాల్పడితే బిడ్డయిన, కొడుకైన క్షేమించేది లేదన్న కేసీఆర్ దళిత మంత్రిని బర్తరఫ్ చేసినట్లు, పేపర్ లీకుల విషయంలో కేటీఆర్ ను కూడా బర్తరఫ్ చేసి కేసీఆర్ నిజాయితీని చాటుకోవాలని డిమాండ్ చేశారు.

జల్, జింగిల్, జమీన్ పోరాట స్పూర్తితో అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని పేర్కొన్నారు. 9 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అన్యాయం చేసారని అన్నారు. అహర్నిశలు కష్టపడి కోచింగ్ సెంటర్ లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ పోరాటంతో ఉద్యోగాలు ప్రకటించి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని, 10 తరగతి ప్రశ్న పత్రాలు అంగట్లో పెట్టి ఇటు విద్యార్థులకు, అటు నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించారు. లక్షా90 వేల ఉద్యోగాలకు 60 వేల ఉద్యోగాలు వేసి ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

బిఆర్ఎస్, బిజెపి రెండు ఒక్కటేనని బిజెపి ముస్లింలకు రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పారని దీనిపై MIM నాయకులు ఓవైసీ స్పందించాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను శాస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీమంత్రి వినోద్, సబ్భీర్, సిరిసిల్ల రాజయ్య nsui నాయకులు పాల్గొన్నారు.