Akhanda 2: అఖండ 2 టీజర్ విడుదల..అభిమానుల తాండవమే..!

Akhanda 2: అఖండ 2 టీజర్ విడుదల..అభిమానుల తాండవమే..!

Akhanda 2: సీనియర్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 తాండవం మూవీ టీజర్ ను చిత్ర బృందం బాలయ్య బర్త్ డే(జూన్ 10) సందర్భంగా విడుదల చేసింది.  మంచుకొండల్లో త్రిశూలధారిగా విలన్ల భరతం పట్టే బీభత్స రసంతో బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో..తమన్ నేపథ్య సంగీతంతో రూపుదిద్దుకున్న అఖండ 2 టీజర్ బాలయ్య అభిమానులలో పూనకాలను తెప్పిస్తుంది. సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న అఖండ 2లో బాలయ్య నటన మరింత హైప్ కు చేరుకుందంటున్నారు అభిమానులు. బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 మూవీ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఘోరగా బాలయ్య నటిస్తున్న అఖండ 2 చిత్రం మహాకుంభమేళలో లక్షలాది భక్తజనం మధ్య షూటింగ్ పూర్తి చేసుకుని..అటు నుంచి జార్జియాలో భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో షూటింగ్ చేసుకున్న అఖండ 2 కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.14 రీల్స్ సంస్థతో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘అఖండ’ నుంచి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన బాలయ్య..వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు. ‘అఖండ 2’ టీజర్ చూస్తుంటే బాలయ్య మరో విజయాన్ని అందుకోవడం ఖాయమంటున్నారు అభిమానులు.