Allu Arjun: పుష్ప‌2 లీక్స్ మొద‌లు.. చిరు లీక్స్ క‌న్నా డేంజ‌ర్‌గా ఉందే..!

Allu Arjun: ఇటీవ‌ల సినిమాల‌కి సంబంధించిన లీకులు ఎక్కువ అవుతున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ జరిగే టైంలోనే, లేదంటే ఎడిటింగ్ రూమ్ నుండో కొన్ని ఫొటోలు లేదా వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. ఇవి నిర్మాత‌ల‌ని ఎంతానో క‌ల‌వ‌ర‌పెట్టిస్తున్నాయి. అయితే ఇటీవ‌లి కాలంలో హీరోలే స్వ‌యంగా లీకులు చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. చిరు లీక్స్.. అంటూ మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజులుగా త‌న సినిమాకి సంబంధించిన ప‌లు వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఓ […]

  • By: sn    latest    Jul 21, 2023 2:42 AM IST
Allu Arjun: పుష్ప‌2 లీక్స్ మొద‌లు.. చిరు లీక్స్ క‌న్నా డేంజ‌ర్‌గా ఉందే..!

Allu Arjun: ఇటీవ‌ల సినిమాల‌కి సంబంధించిన లీకులు ఎక్కువ అవుతున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ జరిగే టైంలోనే, లేదంటే ఎడిటింగ్ రూమ్ నుండో కొన్ని ఫొటోలు లేదా వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. ఇవి నిర్మాత‌ల‌ని ఎంతానో క‌ల‌వ‌ర‌పెట్టిస్తున్నాయి. అయితే ఇటీవ‌లి కాలంలో హీరోలే స్వ‌యంగా లీకులు చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

చిరు లీక్స్.. అంటూ మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజులుగా త‌న సినిమాకి సంబంధించిన ప‌లు వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఓ వేడుకలో ‘ఆచార్య’ టైటిల్ లీక్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ ప‌రిచారు. అనంత‌రం చిరు లీక్స్ పేరుతో తన కొత్త సినిమా విశేషాలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘చిరు లీక్స్’ గురించి అల్లు అర్జున్ ప్రస్తావించ‌డ‌మే కాకుండా త‌న సినిమా డైలాగుని లీక్ చేయ‌డం హాట్ టాపిక్ అయింది.

గ‌త వారం థియేట‌ర్స్ లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజ‌యం సాధించింది బేబి. ఈ చిత్రానికి అన్ని వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో మూవీ రూ. 50 కోట్ల క్లబ్బుకు చేరువలో ఉంది. ఈ క్ర‌మంలో సినిమా అభినందన సభకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రై సంద‌డి చేశారు.

ఇక ఈ వేడుక‌లో చిత్ర బృందాన్ని బ‌న్నీ అభినందించారు. స్పీచ్ ముగించిన త‌ర్వాత ‘పుష్ప 2’ అప్డేట్ చెప్పమని అభిమానులు గోల చేశారు. అప్పుడు ‘పుష్ప 2 లీక్స్ ఆ? అబ్బో.. ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ గా ఉంది’ అని ఆయ‌న అన్నారు. “సినిమా పేరు ‘పుష్ప 2 – ద రూల్’. ఒకటే ముక్క ఉంటుంది. మామూలుగా చెబుతానని నేను అనుకోలేదు. కానీ, చెబుతున్నా.. ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్పాగాడి రూల్” అంటూ సినిమాలో డైలాగ్ చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

‘పుష్ప : ది రైజ్’లో ‘తగ్గేదెలే’, ’పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా’ వంటి డైలాగ్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు సీక్వెల్ లోనూ మరింత పవర్ ఫుల్ గా డైలాగ్స్ ను రాసిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదలైన గ్లింప్స్ కి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. మొత్తానికి ఈ సినిమా మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందని అర్ధ‌మ‌వుతుంది.