ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

విధాత, హైదరాబాద్ : బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. వనపర్తి – కొత్తకోటలో ఈనెల 23న జరిగిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గతంలోనూ రాజాసింగ్‌పై ముస్లింలపైన, ఇస్లాంపైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి.


పొరుగు రాష్ట్రాల్లోనూ రాజాసింగ్‌పై ఈ తరహా కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ మత విద్వేష వ్యాఖ్యల ఆరోపణలపై నమోదైన కేసుల విచారణ కొనసాగుతున్నది. అవి అలా ఉండగానే రాజాసింగ్‌పై కొత్త కేసులు నమోదవుతున్నా హిందూత్వం విషయంలో ఆయన తన దూకుడు మాత్రం తగ్గించకుండా ముందుకెలుతుండటం విశేషం.