గొప్ప మ‌న‌సు.. ట్రాన్స్‌జెండ‌ర్‌ను పెళ్లాడిన ఏపీ యువ‌కుడు

ట్రాన్స్‌జెండ‌ర్.. ఆ పేరు విన‌గానే చాలా మంది చిరాకు ప‌డుతుంటారు. అస్య‌హించుకుంటారు. వారు ఈ స‌మాజంలో భాగం కాద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటారు

గొప్ప మ‌న‌సు.. ట్రాన్స్‌జెండ‌ర్‌ను పెళ్లాడిన ఏపీ యువ‌కుడు

ఖ‌మ్మం : ట్రాన్స్‌జెండ‌ర్.. ఆ పేరు విన‌గానే చాలా మంది చిరాకు ప‌డుతుంటారు. అస్య‌హించుకుంటారు. వారు ఈ స‌మాజంలో భాగం కాద‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. కానీ కొంద‌రు మాత్రం ట్రాన్స్‌జెండ‌ర్ల‌ను గౌర‌విస్తుంటారు. వారు మ‌న‌షులే అని మ‌ర్యాద ఇస్తూ.. వారితో క‌లిసిమెలిసి సాగుతారు. ఓ యువ‌కుడు కూడా ఓ ట్రాన్స్‌జెండ‌ర్ ప‌ట్ల గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. ఆమె ప్రేమ‌ను గౌర‌వించాడు. మూడు ముళ్లు, ఏడు అడుగుల‌తో ఒక్క‌ట‌య్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌మ్మం జిల్లా ఏన్కూరులో న‌క్ష‌త్ర అనే ట్రాన్స్‌జెండ‌ర్ నివాసం ఉంటోంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్స‌న్న‌పేట‌కు చెందిన నందు అనే యువ‌కుడికి న‌క్ష‌త్ర ఇన్‌స్టాగ్రాంలో ప‌రిచ‌యం అయింది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే విష‌యాన్ని ట్రాన్స్‌జెండ‌ర్ సంఘం స‌భ్యుల‌కు తెలిపారు. దీంతో ఏన్కూరు మండ‌లంలోని గార్లఒడ్డు శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆల‌యంలో నందు, న‌క్ష‌త్ర‌కు ఆదివారం ఘ‌నంగా వివాహం జ‌రిపించారు. ఈ కొత్త జంట‌ను ట్రాన్స్‌జెండ‌ర్ సంఘం స‌భ్యులు ఆశీర్వ‌దించారు.