Asifabad | అసిఫాబాద్: పిడుగు పడి ఒకరు మృతి

Asifabad | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం బూపాలపట్నం గ్రామ శివారులో పొలం పనులకొరకు వెళ్లిన రైతు తాకిరే బిక్కజి (40) పై పిడుగు పడి మృతి చెందారు. చేనులో పత్తి విత్తనాలు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మెరిసాయి. వర్షం మొదలైంది. ఈ క్రమంలో టాకిరే బీక్కజి వేపచెట్టు కిందికి వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, […]

  • By: krs    latest    Jun 24, 2023 1:09 PM IST
Asifabad | అసిఫాబాద్: పిడుగు పడి ఒకరు మృతి

Asifabad |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం బూపాలపట్నం గ్రామ శివారులో పొలం పనులకొరకు వెళ్లిన రైతు తాకిరే బిక్కజి (40) పై పిడుగు పడి మృతి చెందారు.

చేనులో పత్తి విత్తనాలు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మెరిసాయి. వర్షం మొదలైంది.

ఈ క్రమంలో టాకిరే బీక్కజి వేపచెట్టు కిందికి వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, నలుగురు కూతుర్లు ఉన్నారు.