MLC Kavitha | 11న విచారణకు వస్తాం.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమాచారం
విధాత: ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఈ నెల 11న విచారించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈ మెయిల్ ద్వారా కవితకు సమాచారం అందించారు. వాస్తవానికి మద్యం కేసులో విచారణకు ఈ నెల 6న విచారణ కోసం ఇంటికి రానున్నట్లు సీబీఐ అధికారులు మొదట నోటీస్‌లు జారీ చేశారు. అయితే సుధీర్ఘంగా తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో సమాలోచనలు చేసిన తర్వాత తనకు 6వ తేదీన వీలు కాదని మరో […]

విధాత: ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను ఈ నెల 11న విచారించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈ మెయిల్ ద్వారా కవితకు సమాచారం అందించారు. వాస్తవానికి మద్యం కేసులో విచారణకు ఈ నెల 6న విచారణ కోసం ఇంటికి రానున్నట్లు సీబీఐ అధికారులు మొదట నోటీస్‌లు జారీ చేశారు. అయితే సుధీర్ఘంగా తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో సమాలోచనలు చేసిన తర్వాత తనకు 6వ తేదీన వీలు కాదని మరో రోజులో వస్తే విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఈ నెల 11,12,14,15 తేదీలో ఏ రోజున వచ్చినా విచారణకు సహకరిస్తానని కవిత సీబీఐ అధికారులకు ఈ మెయిల్స్ ద్వారా సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ నెల 11న కవిత నివాసానికి విచారణకు రానున్నట్లు సమాచారం ఇచ్చారు.