China | 10 వేల మీటర్ల భూగర్భంలోకి చైనా ప్రయాణం.. చమురు కోసమేనా?
China | ఇప్పటికే భూగర్భంలోకి ఒక భారీ గొయ్యిని తవ్వుతున్న చైనా.. అలాంటి రెండో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సించుయాన్ ప్రావిన్సులో ఉన్న షెండీ చువాంకే 1 అనే బావిలో 10 వేల మీటర్ల గొయ్యి తవ్వడం ప్రారంభించామని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించిన షింజియాంగ్ ప్రావిన్సులో కూడా ఇదే లోతున బిలాన్ని తవ్వుతున్నారు. సహజ వాయు నిల్వల అన్వేషణ కోసం డీప్ ఎర్త్ ప్రాజెక్టును ప్రారంభించిన చైనా పలు […]

China |
ఇప్పటికే భూగర్భంలోకి ఒక భారీ గొయ్యిని తవ్వుతున్న చైనా.. అలాంటి రెండో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సించుయాన్ ప్రావిన్సులో ఉన్న షెండీ చువాంకే 1 అనే బావిలో 10 వేల మీటర్ల గొయ్యి తవ్వడం ప్రారంభించామని చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించిన షింజియాంగ్ ప్రావిన్సులో కూడా ఇదే లోతున బిలాన్ని తవ్వుతున్నారు.
సహజ వాయు నిల్వల అన్వేషణ కోసం డీప్ ఎర్త్ ప్రాజెక్టును ప్రారంభించిన చైనా పలు చోట్ల ఈ భూగర్భ పరిశీలన ప్రాజెక్టులను అనుమతులిచ్చింది. గతంలో వీటిని పరిశోధనల వరకే పరిమితం చేస్తామని చెప్పినప్పటికీ.. తాజా ప్రకటనల ప్రకారం.. ఈ పరిశోధనలు గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తి కోసమేనని అర్థమవుతోంది. ముఖ్యంగా సించుయాన్‌లో భూగర్భం లోతు పొరలలో నేచురల్ గ్యాస్ నిల్వలున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎత్తైన కొండలు, నోరూరించే వంటకాలు, పాండాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు.
నం.1 కావాలంటే..
చైనాలో ఉన్న సున్నిత పర్యావరణం, కఠినమైన నేల స్వభావం వల్ల తన వద్దనున్న చమురు నిల్వలను చైనా ఉపయోగించుకోలేక పోతోంది. ఈ ప్రతికూలతలను దాటి చమురు రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తేనే అమెరికా స్థానంలో తమ దేశం నం.1 అవుతుందని ఆ దేశ పాలకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొన్ని సంవత్సరాల నుంచి చమురు అన్వేషణలను ముమ్మరం చేయాలని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం జాతీయ చమురు కంపెనీలను ఒత్తిడి చేస్తోంది. దీంతో చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని భావిస్తున్న చోట.. 10 వేల మీటర్ల లోతుకి వెళ్లి పరిశోధనలు చేయాలని కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆయిల్, గ్యాస్ వెలికితీతలో తమ ప్రయత్నాలు ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తాయని ఇలాంటి ప్రాజెక్టు చేపడుతున్న అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇంత కష్టమా..
ఈ భూగర్భ ప్రయాణంలో శాస్త్రవేత్తలకు ఎన్నో అడ్డంకులు ఎదురు కానున్నాయి. 10 వేల మీటర్ల లోతులో ఉష్ణోగ్రత సుమారు 224 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, అల్ట్రా హై రేంజ్‌లో ఒత్తడి ఉంటుంది. వీటి ప్రభావానికి డ్రిల్లింగ్ టూల్స్ ఉడకబెట్టిన నూడుల్స్‌లా మారిపోతాయి. భూగర్భంలోకి వెళ్లడం భూమిపై అత్యంత లోతట్టు ప్రాంతమైన మారియానా ట్రంచ్‌లోకి వెళ్లడం ఒకటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రయత్నాలు ఎంత మేర ఫలితాన్నిస్తాయో చూడాలి.