Unacademy | విద్యావంతులను ఎన్నుకోండి.. ఆన్‌లైన్ ట్యూటర్ సూచన: మండిపడ్డ బీజేపీ శ్రేణులు
Unacademy | ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం న్యూఢిల్లీ: ఈసారి చదువుకున్నవారిని ఎన్నుకోవాలని, అప్పుడే కష్టాలు తీరుతాయని ఒక ఆన్‌లైన్ ట్యూటర్ చెప్పడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం ‘యునకాడమీ’లో పనిచేసే ఈ ట్యూటర్‌ను యాజమాన్యం వెంటనే తొలగించింది. కరణ్ సంగ్వాన్ అనే ఆన్‌లైన్ ట్యూటర్.. ఒక క్లాస్ చెబుతూ విద్యావంతులను ఎన్నుకోవాలని కోరాడు. ‘మర్చిపోకండి. ఈసారి ఓటు వేసేటప్పుడు బాగా చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోండి. అప్పుడే ఇలాంటిది (కష్టాలు) జరగదు. చదువుకున్న వారిని, […]

Unacademy |
ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
న్యూఢిల్లీ: ఈసారి చదువుకున్నవారిని ఎన్నుకోవాలని, అప్పుడే కష్టాలు తీరుతాయని ఒక ఆన్‌లైన్ ట్యూటర్ చెప్పడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం ‘యునకాడమీ’లో పనిచేసే ఈ ట్యూటర్‌ను యాజమాన్యం వెంటనే తొలగించింది. కరణ్ సంగ్వాన్ అనే ఆన్‌లైన్ ట్యూటర్.. ఒక క్లాస్ చెబుతూ విద్యావంతులను ఎన్నుకోవాలని కోరాడు.
‘మర్చిపోకండి. ఈసారి ఓటు వేసేటప్పుడు బాగా చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోండి. అప్పుడే ఇలాంటిది (కష్టాలు) జరగదు. చదువుకున్న వారిని, విషయాలు అవగాహన చేసుకోగల వారిని ఎన్నుకోండి. కేవలం పేర్లు మార్చడం మాత్రమే తెలిసినవారిని ఎన్నుకోకండి. సరైన నిర్ణయం తీసుకోండి’ అని ఆయన ఆ వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. దేశంలో నేర చట్టాల వ్యవస్థలో మార్పులకు ఉద్దేశించిన బిల్లులపై చర్చలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరతీయడంతో కంపెనీ ఆయనను విధుల నుంచి తొలగించింది. సోషల్ మీడియాలో ట్యూటర్ సంగ్వాన్‌పై తీవ్రస్థాయిలో దాడి జరిగింది. సంగ్వాన్ ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ.. ఆయన బీజేపీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి మాట్లాడారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
जब एक शिक्षक ने बच्चो को जागरूक करने के लिए सच बोल दिया तो उसे अपने नौकरी से ही हाथ धोना पड़ गया