Karnataka | తల్లిని కాటేసిన నాగుపాము.. ప్రాణాలు కాపాడిన కూతురు
Karnataka | ఓ మహిళను నాగుపాము( King Cobra ) కాటేసింది.. ఆమె కేకలు వేస్తూ కిందపడిపోయింది. సమీపంలో ఉన్న కూతురు( Daughter ) అప్రమత్తమై.. అక్కడికి పరుగెత్తింది. క్షణం కూడా సమయం వృధా చేయకుండా.. కాటేసిన ప్రాంతంలో తన నోటితో విషంతో కూడిన రక్తాన్ని పీల్చి బయటకు ఉమ్మింది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లి, తల్లి ప్రాణాలను కాపాడుకుంది కూతురు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక( Karnataka )లోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఎట్కెడ్య గ్రామానికి చెందిన మమత […]

Karnataka | ఓ మహిళను నాగుపాము( King Cobra ) కాటేసింది.. ఆమె కేకలు వేస్తూ కిందపడిపోయింది. సమీపంలో ఉన్న కూతురు( Daughter ) అప్రమత్తమై.. అక్కడికి పరుగెత్తింది. క్షణం కూడా సమయం వృధా చేయకుండా.. కాటేసిన ప్రాంతంలో తన నోటితో విషంతో కూడిన రక్తాన్ని పీల్చి బయటకు ఉమ్మింది. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లి, తల్లి ప్రాణాలను కాపాడుకుంది కూతురు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక( Karnataka )లోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఎట్కెడ్య గ్రామానికి చెందిన మమత పొలంలో బోరు వేసేందుకు వెళ్లింది. పొలం నుంచి తిరిగి వస్తుండగా, ఇంటికి సమీపంలో మమతను ఓ నాగుపాము కాటేసింది. దీంతో ఆమె విలవిలలాడుతూ.. కేకలు వేస్తూ కిందపడిపోయింది.
ఆమె కేకలు విన్న కూతురు శ్రమ్య తల్లి వద్దకు పరుగెత్తింది. విషం శరీరమంతా వ్యాపించకుండా.. కాటేసిన ప్రాంతంలో ఓ బట్ట కట్టింది. అనంతరం కాటేసిన భాగం నుంచి రక్తాన్ని పీల్చి బయటకు ఉమ్మింది.
ఆ తర్వాత స్థానికుల సహాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. వైద్యులు చికిత్స చేశారు. అయితే విషం శరీరమంతా వ్యాపించకుండా, రక్తాన్ని పీల్చి తల్లి ప్రాణాలు కాపాడుకున్న శ్రమ్యపై స్థానికులు, డాక్టర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.