దురాజ్ పల్లి జాతరను వైభవంగా నిర్వహించాలి: మంత్రి జగదీష్ రెడ్డి
రూ.50లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన పెద్దగట్టు జాతర షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి విధాత: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరను వైభవంగా నిర్వహించాలని మంత్రి జి జగదీష్ రెడ్డి సూచించారు. సోమవారం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తో కలిసి హాజరయ్యారు. బడుగుల ఎంపీ కోటా రూ.50 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీష్ […]

- రూ.50లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన
- పెద్దగట్టు జాతర షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి
విధాత: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరను వైభవంగా నిర్వహించాలని మంత్రి జి జగదీష్ రెడ్డి సూచించారు. సోమవారం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తో కలిసి హాజరయ్యారు.
బడుగుల ఎంపీ కోటా రూ.50 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. జాతరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక్యరాలు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగము, పాలకమండలి సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం ఆయన జాతర తేదీలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు అలయ చైర్మన్ కోడి సైదులు యాదవ్ తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర షెడ్యూల్
లింగమతుల స్వామి పెద్దగట్టు జాతర నిర్వహణలో భాగంగా జనవరి జనవరి 22న ఆదివారం రాత్రి 11 గంటలకు దిష్టిపూజ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5 నుండి 9వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది.
- ఫిబ్రవరి 5 ఆదివారం రాత్రి కేసారం గ్రామము నుండి దేవర పెట్టె తీసుకొని రావడం, గంపలతో గుడి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించనున్నారు.
- 6వ తేదీ సోమవారం బోనాలు సమర్పించుట, ముద్దేర పోలు, మధ్యాహ్నం జాగిలాలు పోసే కార్యక్రమాలు కొనసాగుతాయి.
- 7వ తేదీ మంగళవారం గుడి ముందు పూజారులు చంద్ర పట్నం వేస్తారు.
- 8వ తేదీ బుధవారం పూజారులు నెలవారం చేయడం, దేవర పేట్టె కేసారముకు తీసుకొని పోవుడం జరుగుతుంది.
- 9వ తేదీ గురువారం జాతర ముగింపులో భాగంగా మకర తోరణం ఊరేగింపుతో సూర్యాపేటకు తీసుకు వెళ్లే కార్యక్రమం నిర్వహిస్తారు.