Kashmir | కాశ్మీర్‌లో బుల్లెట్ల ఆట ముగించండి.. ప్రధానికి ఓవైసీ డిమాండ్‌

Kashmir | విధాత: క్రికెట్ మ్యాచ్‌కు ముందే కాశ్మీర్ రాజౌరిలో కాశ్మీరి పండిట్లతో, భారత సైనికులతో పాక్ ఉగ్రవాదులు సాగిస్తున్న బుల్లెట్ల ఆటను ముగించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ కేంద్రాన్నిడిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ అనంతనాగ్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ పై కేంద్రం తీరును ఓవైసీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ పాలసీ విఫలమైందన్నారు. అందుకే అక్కడ పాక్ ఉగ్రవాదులు బుల్లెట్ల ఆట ఆడుతున్నారన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ […]

  • By: krs    latest    Sep 16, 2023 12:41 PM IST
Kashmir | కాశ్మీర్‌లో బుల్లెట్ల ఆట ముగించండి.. ప్రధానికి ఓవైసీ డిమాండ్‌

Kashmir |

విధాత: క్రికెట్ మ్యాచ్‌కు ముందే కాశ్మీర్ రాజౌరిలో కాశ్మీరి పండిట్లతో, భారత సైనికులతో పాక్ ఉగ్రవాదులు సాగిస్తున్న బుల్లెట్ల ఆటను ముగించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ కేంద్రాన్నిడిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ అనంతనాగ్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ పై కేంద్రం తీరును ఓవైసీ విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ పాలసీ విఫలమైందన్నారు. అందుకే అక్కడ పాక్ ఉగ్రవాదులు బుల్లెట్ల ఆట ఆడుతున్నారన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతారా అని ప్రశ్నించారు. ఆక్టోబర్ 14న ప్రపంచ క్రికెట్ కప్‌లో భాగంగా ఇక్కడ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్న నేపధ్యంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందన్నారు. పుల్వామా దాడిపై స్పందించిన కేంద్రం తర్వాతా ఉగ్రవాదులు కల్నల్‌, డిప్యూటీ ఎస్పీలను చంపేశారని, అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌పై కూడా మోడీ స్పందించలేదన్నారు.