Gandhi Bhavan | గాంధీభవన్‌కు తాకిన పొన్నం పంచాయతీ
Gandhi Bhavan అనుచరుల నిరసన ఠాక్రే హామీ విధాత: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు స్థానం కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అనుచరులు ఆదివారం గాంధీ భవన్ వద్ద నిరసనకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన, సీనియర్ నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నంను ఎన్నికల కమిటీలోకి తీసుకోకుండా రాజకీయంగా అణిచివేసే కుట్ర చేస్తున్నారంటు వారు ఆరోపించారు. రేవంత్ ముందు పొన్నంకు తగిన ప్రాధాన్యత కల్పించాలంటూ […]

Gandhi Bhavan
- అనుచరుల నిరసన
- ఠాక్రే హామీ
విధాత: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు స్థానం కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అనుచరులు ఆదివారం గాంధీ భవన్ వద్ద నిరసనకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన, సీనియర్ నేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నంను ఎన్నికల కమిటీలోకి తీసుకోకుండా రాజకీయంగా అణిచివేసే కుట్ర చేస్తున్నారంటు వారు ఆరోపించారు.
రేవంత్ ముందు పొన్నంకు తగిన ప్రాధాన్యత కల్పించాలంటూ నినాదాలు చేశారు. అయితే ఇదే రోజు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉన్నందున తర్వాత మాట్లాడుదామని రేవంత్ వారికి సర్ధిచెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ మాణిక్‌రావు ఠాక్రే దీనిపై స్పందిస్తూ పొన్నంను కూడా కమిటీలోకి తీసుకుంటామంటు హామీ ఇచ్చారని తెలుస్తుంది.