Ganga Ramayan Yatra | వారణాసి, అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా..? మీకోసమే బంపర్‌ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ..!

Ganga Ramayan Yatra | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. వారణాసి, అయోధ్య రామమందిరాలను సందర్శించాల నుకునే భక్తుల కోసం స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ‘గంగా రామయణ్‌ యాత్ర’ పేరిట ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచే టూర్‌ ప్యాకేజీ మొదలవనున్నది. టూర్‌ రైలులో కాదండోయ్‌ విమానంలో సాగనున్నది. వారణాసి, అయోధ్య, నైమీశరణ్య, ప్రయాగ్‌రాజ్‌, సార్‌నాథ్‌లోని ఆలయాలను ప్యాకేజీలో చూడొచ్చు. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ మే 25న అందుబాటులో […]

Ganga Ramayan Yatra | వారణాసి, అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా..? మీకోసమే బంపర్‌ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ..!

Ganga Ramayan Yatra |

పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. వారణాసి, అయోధ్య రామమందిరాలను సందర్శించాల నుకునే భక్తుల కోసం స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ‘గంగా రామయణ్‌ యాత్ర’ పేరిట ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచే టూర్‌ ప్యాకేజీ మొదలవనున్నది. టూర్‌ రైలులో కాదండోయ్‌ విమానంలో సాగనున్నది. వారణాసి, అయోధ్య, నైమీశరణ్య, ప్రయాగ్‌రాజ్‌, సార్‌నాథ్‌లోని ఆలయాలను ప్యాకేజీలో చూడొచ్చు. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఈ ప్యాకేజీ మే 25న అందుబాటులో ఉండనున్నది.

పర్యటన సాగేదిలా..

ఐఆర్‌సీటీసీ గంగా రామయణ్‌ యాత్ర తొలిరోజు హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఉదయం 9.15 గంటలకు విమానంలో బయలుదేరి 1.15 గంటలకు వారణాసి చేరుకుంటున్నారు. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, గంగాఘాట్‌లను సందర్శిస్తారు.

రాత్రి వారణాసిలోనే బస చేస్తారు. రెండో రోజు ఉదయం సార్‌నాథ్‌ బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యాహ్నం మళ్లీ తిరిగి వారణాసికి చేరుకుంటారు. సాయం ఖాళీ సమయం ఉంటుంది. ఎవరికి ఇష్టం మేరకు వారు ఘాట్లను సందర్శించుకోవచ్చు లేదంటే షాపింగ్‌ చేసుకోవచ్చు. రాత్రికి వారణాసిలోనే బస ఉంటుంది. మూడోరోజు ఉదయం హోటల్‌ను ఖాళీ చేసి ప్రయాగ్‌రాజ్‌ వెళ్లాలి.

అక్కడ అలోపి దేవాలయం, త్రివేణి సంగమాలను చూడవచ్చు. ఇక సాయంత్రం అయోధ్యకు బయలుదేరుతారు. రాత్రికి అయోధ్యలో బస చేసి, ఉదయం అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం లక్నో బయలుదేరితే సాయంత్రానికి చేరుకుంటారు. రాత్రి లక్నోలోనే బస చేసి.. ఐదో రోజు ఉదయం నైమీశరణ్య ఫుల్ డే టూర్ ఉంటుంది.

సాయంత్రం తిరిగి లక్నో చేరుకొని అక్కడే బస చేయాలి. ఆరో రోజు బారా ఇమాంబారా, అంబేద్కర్ మెమొరియల్ పార్క్‌లను సందర్శిస్తారు. ఆ తర్వాత హైరదాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. లక్నోలో సాయంత్రం 6 గంటలకు విమానం ఎక్కితే రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ఎంతంటే..

గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ధర రూ.28,200కే ఐఆర్‌సీటీసీ అందిస్తున్నది. అలాగే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,900, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,850 చెల్లించాల్సి వస్తుంది. ప్యాకేజీలో విమానం టికెట్లు, హోటల్‌, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ అన్నీ కవర్‌ అవుతాయి.