Gold Rate | దిగివస్తున్న బంగారం ధర.. మరోసారి రూ.56వేల దిగువకు..! హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Rate | వరుసగా దిగివస్తున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండో రోజు పుత్తడి ధరలు తగ్గాయి. బుధవారం 22 క్యారెట్ల బంగారంపై రూ.290 తగ్గి.. మరోసారి రూ.56వేల దిగువకు చేరింది. 24 క్యారెట్ల పసడి ధర రూ.310 తగ్గి రూ.61,100 చేరింది. మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గ ముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర […]

Gold Rate | దిగివస్తున్న బంగారం ధర.. మరోసారి రూ.56వేల దిగువకు..! హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

Gold Rate | వరుసగా దిగివస్తున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండో రోజు పుత్తడి ధరలు తగ్గాయి.

బుధవారం 22 క్యారెట్ల బంగారంపై రూ.290 తగ్గి.. మరోసారి రూ.56వేల దిగువకు చేరింది. 24 క్యారెట్ల పసడి ధర రూ.310 తగ్గి రూ.61,100 చేరింది. మరో వైపు వెండి ధరలు సైతం స్వల్పంగా తగ్గ ముఖం పట్టాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల పసడి ధర రూ.61,250కి తగ్గింది.

ముంబయి మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56వేలు, 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,100కు దిగివచ్చింది.

చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,580కు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధర సైతం తగ్గుతూ వస్తున్నది. కిలో వెండిపై రూ.500 తగ్గి రూ.74,500 ధర పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78వేలు ఉన్నది.

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కె్‌ట్‌లో గత 24 గంటల్లో స్పాట్‌ బంగారం రేటు స్థిరంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,975 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.