Gold Rate | మూడోరోజు పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మళ్లీ రూ.57వేలు దాటిన పుత్తడి..!

Gold Rate | దేశీయ మార్కెట్‌లో బంగారం రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు పెరగడంతో.. తులం బంగారం 62వేల మార్క్‌ను దాటింది. గురువారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.250 పెరిగి.. రూ.56,950 పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.280పై పెరగడంతో రూ.62వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం రూ.62,130 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల […]

Gold Rate | మూడోరోజు పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో మళ్లీ రూ.57వేలు దాటిన పుత్తడి..!

Gold Rate |

దేశీయ మార్కెట్‌లో బంగారం రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు పెరగడంతో.. తులం బంగారం 62వేల మార్క్‌ను దాటింది. గురువారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.250 పెరిగి.. రూ.56,950 పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.280పై పెరగడంతో రూ.62వేల మార్క్‌ను దాటింది.

ప్రస్తుతం రూ.62,130 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసడి ధర రూ.57,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,280 వద్ద స్థిరపడింది.

ఇక హైదరాబాద్‌ మార్కెట్‌లో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ.56,950కి పెరిగింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,130కి చేరింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. 24 గంటల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు 2,031 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఇక వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.78వేలకు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.82,700 ధర పలుకుతున్నది.