షర్మిల వియ్యంకురాలి చట్నీస్ సంస్థలపై ఐటీ దాడులు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలైన అట్లూరి పద్మకు చెందిన చట్నీస్ సంస్థలపై ఐటీ మంగళవారం సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్స్, సంస్థలలో ఐటీ అధికారులు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు

విధాత : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలైన అట్లూరి పద్మకు చెందిన చట్నీస్ సంస్థలపై ఐటీ మంగళవారం సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని చట్నీస్ హోటల్స్, సంస్థలలో ఐటీ అధికారులు బృందాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ ఇంట్లో కూడా సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తుంది.
చట్నీస్‌తో పాటు మేఘనా ఫుడ్స్ ఈటరీస్ లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై ఐటీ అధికారుల నుంచి అధికారికంగా సమాచారం వెల్లడికావాల్సివుంది. చట్నీస్ సంస్థ యజమాని అట్లూరి పద్మ కుమార్తె ప్రియతో షర్మిల కుమారుడు రాజారెడ్డితో గత నెల 17న వివాహం జరిగింది. తాజా ఐటీ దాడులు రాజకీయ కోణంలో జరిగాయా లేక సాధారణంగా జరిగినవేనా అన్నది తేలాల్సివుంది.