ఢిల్లీకి జగన్.. ప్రధానితో భేటీ.!
విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాగా ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో అన్ని పార్టీల నేతలతో జరిగిన అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కొద్ది నిమిషాలపాటు జగన్.. ప్రధానితో మాట్లాడారు. ఇప్పుడు మరోమారు జగన్.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలో జీ 20 సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం […]

విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కాగా ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో అన్ని పార్టీల నేతలతో జరిగిన అఖిలపక్ష సమావేశానికి జగన్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కొద్ది నిమిషాలపాటు జగన్.. ప్రధానితో మాట్లాడారు. ఇప్పుడు మరోమారు జగన్.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
ఈ సందర్బంగా విశాఖపట్నంలో జీ 20 సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు ఇతరత్రా వివరాలను జగన్ ప్రధానికి వివరిస్తారు. విశాఖపట్నంలో జీ20 దేశాల రెండు సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి సమావేశం 2023 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, రెండవ సమావేశం ఏప్రిల్ 24న జరగనుంది. కాగా జీ 20 దేశాల సమావేశానికి ఏర్పాట్లను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.
అలాగే సంక్రాంతికి కడపలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానిని కూడా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించనున్నారు. జిందాల్ గ్రూపునకు చెందిన సంస్థ కడపలో స్టీల్ ప్లాంట్ పెడుతోంది. మోడీతో భేటీ సందర్భంగా విశాఖపట్నంలో రైల్వే జోన్, రామాయపట్నంలో ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రధానికి వివరిస్తారని తెలుస్తోంది.
పోలవరానికి నిధుల కేటాయింపు కూడా జగన్ ప్రస్తావిస్తారని అంటున్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్ధేశం ఉంటే ఆ విషయాన్ని కూడా మోడీతో మాట్లాడి ముందస్తు అనుమతి తీసుకుంటారని అంటున్నారు.