Palamuru | పాలమూరు కాంగ్రెస్‌లో జోష్.. ‘తిరగబడతాం.. తరిమి కొడతాం’ విజయవంతం
Palamuru | కలిసికట్టుగా కదిలిన నేతలు పార్టీ శ్రేణుల్లో భరోసా విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉప్పొంగారు. ‘తరిమికొడతాం..తిరగబడతాం’కార్యక్రమం కార్యకర్తల్లో బలాన్ని నింపింది. ఇటీవల పాలమూరు లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా కదలి వచ్చారు. కార్యకర్తల్లో మనోబలం నిండింది. జిల్లా లో ఇటీవల టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామంతో […]

Palamuru |
- కలిసికట్టుగా కదిలిన నేతలు
- పార్టీ శ్రేణుల్లో భరోసా
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉప్పొంగారు. ‘తరిమికొడతాం..తిరగబడతాం’కార్యక్రమం కార్యకర్తల్లో బలాన్ని నింపింది. ఇటీవల పాలమూరు లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా కదలి వచ్చారు. కార్యకర్తల్లో మనోబలం నిండింది. జిల్లా లో ఇటీవల టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామంతో ఇక్కడి కార్యకర్తల్లో మనోనిబ్బరం కలిగించేందుకు కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితం ఇచ్చింది. పార్టీ నాయకులు కేసులకు భయపడేది లేదనే ధైర్యం ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ ఆశించే నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో.. ఆ నేతల వర్గీయులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
టికెట్ రేసులో ముందున్న నేతలు మల్లు రవి, అలంపూర్ నియోజకవర్గం నేత సంపత్ కుమార్, వనపర్తి నుంచి జీ చిన్నా రెడ్డి, గద్వాల నుంచి సరిత, నారాయణ పేట కు చెందిన నేత కుంభం శివకుమార్ రెడ్డి, కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎర్ర శేఖర్, దేవరకద్రకు చెందిన డీసీసీ అధ్యక్షులు జీ మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీసీ అధ్యక్షులు ఒబేధుల్లా కొత్వాల్ ఇతర నేతలు తమ వర్గం కాంగ్రెస్ శ్రేణులకు భరోసా నింపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, కార్యకర్తలు మనోధైర్యాన్ని వీడకుండా కలిసి కట్టుగా పని చేస్తే తెలంగాణ లో జెండా ఎగురవేస్తామని పాలమూరు సభ ద్వారా వెల్లడించారు. భారీ గా కార్యకర్తలు తరలిరావడం తో పాలమూరు ఉమ్మడి జిల్లా లో కాంగ్రెస్ పట్టునిలుపుకునే అవకాశం ఉంది.