వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. ఇద్ద‌రికి ఈ పుర‌స్కారం

  • Publish Date - October 2, 2023 / 10:26 AM IST

విధాత‌: ప్ర‌పంచం ఎంత‌గానో ఎదురుచూసే నోబెల్ (Nobel in Medicine) అవార్డుల ప్ర‌క‌ట‌న ప్రారంభ‌మైంది. 2023 సంవ‌త్స‌రానికి గానూ వైద్య రంగానికి సంబంధించి కాట‌లిన్ క‌రీకో, డ్య్రూ వీస్‌మాన్‌లు ఈ అవార్డుకు ఎంపిక‌య్యారు. రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ సోమ‌వారం ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. న్యూక్లియో సైడ్ లో జ‌రిగే మార్పుల‌లో చేసిన ప‌రిశోధ‌న‌కుగానూ వీరికి నోబెల్ ల‌భించింది.


ఈ సాంకేతిక‌తను ఉప‌యోగించే కొవిడ్ మ‌హ‌మ్మారి విరుగుడుకి ఎం ఆర్ఎన్ఏ టీకాలను త‌యారుచేశారు. సుమారు 50 మందితో కూడిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శాస్త్రవేత్త‌ల, ప‌రిశోధ‌కుల బృందం క‌రీకో, డ్య్రూల‌ను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక‌చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 113 నోబెల్ అవార్డుల‌ను సైకాల‌జీ, మెడిసిన్ విభాగంలో ఇచ్చారు. వీరిలో 12 మంది మ‌హిళలు ఉన్నారు.


కాగా.. 2022లో ఈ అవార్డుకు స్వీడిష్ జాతీయుడైన స్వాంటే పాబో ఎంపికైన విష‌యం తెలిసిందే. నోబెల్ అవార్డు పొందిన వారికి తొమ్మిది ల‌క్ష‌ల డాల‌ర్లు (రూ.7 కోట్లు) ప్రైజ్ మ‌నీగా అందుతాయి. 1895లో మ‌ర‌ణించిన స్వీడిష్ ప‌రిశోధ‌కుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాప‌కార్థం ఈ అవార్డుల‌ను అందిస్తున్నారు. ఆయ‌న వ‌దిలివెళ్లిన ఆస్తి నుంచే ప‌రిశోధ‌కులకు ప్రైజ్‌మ‌నీ చెల్లిస్తారు.

Latest News