Warangal | విముక్తి పోరాట చరిత్రను మరుగు పరుస్తున్నకేసీఆర్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Warangal | కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ పరేడ్ గ్రౌండ్స్ నుంచి పరకాల బైక్ ర్యాలీ 200 కిలోమీటర్లు.. అడుగడుగునా స్వాగతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విమోచన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలనడం ద్వారా విముక్తి పోరాట వాస్తవ చరిత్రను మరుగు పరచాలనే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రయత్నం తిప్పికొట్టి, వాస్తవ చరిత్రను ప్రజలకు చాటిచెప్పేందుకు సిద్ధమయ్యామన్నారు. వీళ్ళు మూర్ఖులు అంటూ మండిపడ్డారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ […]

  • By: krs    latest    Sep 16, 2023 12:25 AM IST
Warangal | విముక్తి పోరాట చరిత్రను మరుగు పరుస్తున్నకేసీఆర్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Warangal |

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ
  • పరేడ్ గ్రౌండ్స్ నుంచి పరకాల బైక్ ర్యాలీ
  • 200 కిలోమీటర్లు.. అడుగడుగునా స్వాగతం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విమోచన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలనడం ద్వారా విముక్తి పోరాట వాస్తవ చరిత్రను మరుగు పరచాలనే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రయత్నం తిప్పికొట్టి, వాస్తవ చరిత్రను ప్రజలకు చాటిచెప్పేందుకు సిద్ధమయ్యామన్నారు. వీళ్ళు మూర్ఖులు అంటూ మండిపడ్డారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుండచి పరకాల అమరధామం వరకు సుమారు 200 కిలోమీటర్ల దూరం బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జనగామ, హనుమకొండ మీదుగా అమరధామం వరకు వెళ్ళారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం ఉక్కుపిడికిలిలో నలిగిన హైదరాబాద్ సంస్థాన్ విముక్తి గాథ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టమని, దీన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బుద్ధిచెప్పాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హనుమకొండ అదాలత్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది.

పరకాల అమరదామంలో రక్త తర్పణం చేసిన అమరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, రావు పద్మ, కుసుమ సతీష్, రవికుమార్, మొలుగూరి, కాళీప్రసాద్ పాల్గొన్నారు.