బీజేపీ పేరు మార్చుకోవాలి.. కేటీఆర్ సెటైర్లు

విధాత: టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి భార‌తీయ జ‌నతా పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆ పార్టీ పేరు మార్చుకుంటే బాగుంటుంద‌ని సూచిస్తూ.. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ నెల 15వ తేదీలోపు మునుగోడు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని బీజేపీ నాయ‌కుడు చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈసీ కంటే ముందే బీజేపీ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కంటే ముందే బీజేపీనే సోదాల‌ను ఎదుర్కొబోయే వారి […]

బీజేపీ పేరు మార్చుకోవాలి.. కేటీఆర్ సెటైర్లు

విధాత: టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి భార‌తీయ జ‌నతా పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆ పార్టీ పేరు మార్చుకుంటే బాగుంటుంద‌ని సూచిస్తూ.. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ నెల 15వ తేదీలోపు మునుగోడు ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని బీజేపీ నాయ‌కుడు చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

ఈసీ కంటే ముందే బీజేపీ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కంటే ముందే బీజేపీనే సోదాల‌ను ఎదుర్కొబోయే వారి పేర్ల‌ను ప్ర‌క‌టిస్తుంది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ కంటే ముందే బీజేపీనే ఆయా సంస్థ‌ల‌పై నిషేధం విధిస్తుంద‌ని విమ‌ర్శించారు.

ఐటీ దాడుల కంటే ముందే బీజేపీ న‌గ‌దు వివ‌రాల‌ను వెల్ల‌డిస్తుంద‌న్నారు. సీబీఐ కంటే ముందే.. నిందితుల పేర్ల‌ను బీజేపీ వెల్ల‌డిస్తుంద‌ని కేటీఆర్ విమర్శ‌లు గుప్పించారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ త‌న పేరును మార్చుకుంటే బాగుంటుంద‌న్నారు కేటీఆర్.