చికిత్స అందిస్తున్నా స్పృహలోకి రాని తారకరత్న.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు కుప్పంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా యత్నిస్తున్నారు. యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తారకరత్న చికిత్సకు స్పందించడం లేదని వార్తలు వస్తున్నాయి. లోకేశ్ పాదయాత్రలో స్పృహ తప్పిపడిపోయిన తారకరత్నను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తారకరత్న చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు […]

Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు కుప్పంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా యత్నిస్తున్నారు. యాంజియోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తారకరత్న చికిత్సకు స్పందించడం లేదని వార్తలు వస్తున్నాయి.
లోకేశ్ పాదయాత్రలో స్పృహ తప్పిపడిపోయిన తారకరత్నను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తారకరత్న చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కుప్పం సమీపంలోని శ్రీవరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే యాత్ర ప్రారంభమైన కాసేపటికే తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
దీంతో చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. మొదట పల్స్ పూర్తిగా పడిపోయాయి. శరీరం పూర్తిగా బ్లూ కలర్‌లోకి మారిపోయిందని, 45 నిమిషాల తర్వాత పల్స్ మొదలైందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగు పడుతుందని ఆశిస్తున్నామని వైద్యులు చెప్పారు. బెట్టర్ ట్రీట్‌మెంట్ కోసం యత్నిస్తున్నామని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది.
అయితే మధ్యాహ్నం 2.25 నిమిషాల సమయంలో ఆస్వత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం తారకరత్న ఇరోగ్యం నిలకడగా ఉందని, స్టంట్ వేశామని మరో 48 గంటల పాటు అబ్ఝర్వేషన్‌లో ఉంచామని తెలిపారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తారకత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని, ఎంజీయోగ్రామ్ పూర్తైందని, ఎలాంటి స్టంట్లు వేయలేదని పేర్కొన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ తారకరత్నను హెలికాప్టర్‌లో బెంగళూరుకు తరలిస్తామని తెలిపారు.
తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న.. బ్లూ కలర్‌లోకి శరీరం #NARALOKESH #TARAKARATNA #YUVAGALAM #TDPTwitter pic.twitter.com/C3jRNTEWXi
— vidhaathanews (@vidhaathanews) January 27, 2023