కూతురికి కిడ్నీ దానం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు.. వైరల్ అవుతున్న ఫోటో
Daughter Kidney | ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే చివరి దాకా గుండెల్లో పెట్టుకుంటారు. ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో అవయవ దానం చేసి పునర్జన్మ ఇస్తే.. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ మాదిరిగానే ఓ తండ్రి కూడా తన బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన ఓ వ్యక్తికి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ ఫోటో నెటిజన్ల […]

Daughter Kidney | ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే.. వారు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే చివరి దాకా గుండెల్లో పెట్టుకుంటారు. ప్రాణాలతో పోరాడుతున్న సమయంలో అవయవ దానం చేసి పునర్జన్మ ఇస్తే.. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ మాదిరిగానే ఓ తండ్రి కూడా తన బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన ఓ వ్యక్తికి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ ఫోటో నెటిజన్ల హృదయాలను దోచుకుంది.
ఓ వ్యక్తి కూతురు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఆమె కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. దీంతో సదరు వ్యక్తి తన కారు వెనుకాల ఉన్న అద్దానికి డాటర్ నీడ్ కిడ్నీ(కూతురికి కిడ్నీ అవసరమైంది) అని రాసి ఉంచాడు. దీన్ని చూసిన ఓ వ్యక్తి.. తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆ బిడ్డకు తన కిడ్నీని దానం చేసి ప్రాణం పోశాడు. ఇందుకు కృతజ్ఞతగా ఆ బిడ్డ తండ్రి.. తన కారు వెనుకాల రాసిన డాటర్ నీడ్ కిడ్నీ స్థానంలో డాటర్ గాట్ కిడ్నీ(కూతురికి కిడ్నీ దొరికింది) అని రాసి ఉంచాడు. థాంక్యూ విల్లీ.. నీ నిస్వార్థమైన బహుమతికి కృతజ్ఞతలు అని డాటర్ గాడ్ కిడ్నీ కింద రాసి ఉంచాడు. ఈ పదాలు అందరి మనసులను హత్తుకున్నాయి. ఈ ట్వీట్‌ను 2 లక్షలకు పైగా లైక్ చేశారు.
— Dudes Posting Their W’s (@DudespostingWs) November 15, 2022