Medak | అమ్మవారి దర్శనానికి వెళ్తున్న దంపతులు.. రోడ్డు ప్రమాదంలో మృతి…
Medak టీవీఎస్‌ఎక్సెల్‌ను ఢీకొన్న ట్రాలీ ఆటో విధాత, మెదక్ బ్యూరో: టీవీఎస్ ఎక్సెల్ ను ట్రాలీ ఆటో ఢీకొనగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్న దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని అంతారం గేటు సమీపాన గురువారం రోజున చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మెదక్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి 36 అతని భార్య జక్కుల యాదమ్మ 32 తో కౌడిపల్లి […]

Medak
- టీవీఎస్‌ఎక్సెల్‌ను ఢీకొన్న ట్రాలీ ఆటో
విధాత, మెదక్ బ్యూరో: టీవీఎస్ ఎక్సెల్ ను ట్రాలీ ఆటో ఢీకొనగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్న దంపతులు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని అంతారం గేటు సమీపాన గురువారం రోజున చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మెదక్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి 36 అతని భార్య జక్కుల యాదమ్మ 32 తో కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో గల నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి గురువారం రోజు ఉదయం టీవీఎస్ ఎక్సెల్ పై బయలుదేరారు. కౌడిపల్లి మండలం అంతారం గేటు సమీపాన నర్సాపూర్ వైపు నుండి మెదక్ వైపు వెళ్తున్న ట్రాలీఆటో టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొన్నది.
ఈ సంఘటనలో యాదగిరి అతని భార్య యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుమారుడు జక్కుల నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.