Medak | కుటుంబ తగాదాలు.. చెరువులో దూకి తల్లి, పిల్లలు ఆత్మహత్య

Medak | విధాత, మెదక్ బ్యూరో: కుటుంబ తగాదాలతో తల్లి ఇద్దరు కూతుర్లతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మెదక్ మండలంలో చోటుచేసుకుంది. మెదక్ డిఎస్పి సైదులు తెలిపిన కథనం ప్రకారం. రామయం పేట మండలం అక్కనపేట గ్రామానికి చెందిన ఎల్లంకు మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కోక్కుల లక్ష్మితో ఏడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. గత తొమ్మిది రోజుల కిందట కుటుంబ […]

  • By: krs    latest    Jun 20, 2023 1:28 PM IST
Medak | కుటుంబ తగాదాలు.. చెరువులో దూకి తల్లి, పిల్లలు ఆత్మహత్య

Medak |

విధాత, మెదక్ బ్యూరో: కుటుంబ తగాదాలతో తల్లి ఇద్దరు కూతుర్లతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మెదక్ మండలంలో చోటుచేసుకుంది. మెదక్ డిఎస్పి సైదులు తెలిపిన కథనం ప్రకారం.

రామయం పేట మండలం అక్కనపేట గ్రామానికి చెందిన ఎల్లంకు మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కోక్కుల లక్ష్మితో ఏడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం.

గత తొమ్మిది రోజుల కిందట కుటుంబ తగాదాలతో అక్కనపేటలో ఎల్లo విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా అతనిని నార్సింగ్ లోని చారి హాస్పిటల్ కు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మెదక్ రష్ హాస్పిటల్ కు తరలించారు.

అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది..

దవాఖానలో ఉన్న భర్తను చూడడానికి కొక్కుల లక్ష్మి(28) తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి గారు ఊరు వెంకటాపూర్ నుంచి వచ్చి తిరుగు ప్రయాణంలో కొంటూర్ చెరువులో తన ఇద్దరు పిల్లలతో సహా దూకి శరణ్య (5) శ్రావ్య (3) దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెదక్ డిఎస్పి సైదులు సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను చెరువులో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్లున్నట్లు డీఎస్పీ తెలిపారు. విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ ఏరియా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వారికి ఆర్థిక సాయం అందజేశారు.