Medak | మెగా జాబ్‌ మేళా విజయవంతం: సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

Medak | 70 కంపెనీల ప్రతినిధులు హాజరు తరలివచ్చిన 4 వేలకు పైగా యువతీ, యువకులు 450 మందికి ఆఫర్‌ లెటర్స్‌ విధాత, మెదక్ బ్యూరో: సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ద్వారకా, సాయిబాలజీ గార్డెన్స్ లో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళా గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి యువతనుద్దేశించి […]

  • By: krs    latest    Aug 17, 2023 4:26 PM IST
Medak | మెగా జాబ్‌ మేళా విజయవంతం: సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

Medak |

  • 70 కంపెనీల ప్రతినిధులు హాజరు
  • తరలివచ్చిన 4 వేలకు పైగా యువతీ, యువకులు
  • 450 మందికి ఆఫర్‌ లెటర్స్‌

విధాత, మెదక్ బ్యూరో: సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ద్వారకా, సాయిబాలజీ గార్డెన్స్ లో గురువారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళా గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి యువతనుద్దేశించి ప్రసంగించారు. యువతను సన్మార్గంలో పయనింప జేసేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం 70 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సుమారు 4,500 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ప్రముఖ కంపెనీలైన , విప్రో, జెన్‌ప్యాక్‌, హెచ్‌సీఎల్‌, అపోలో, మెడిప్లస్, హోం ఇన్నోవేషన్, ప్రైమరీ హెల్త్ కేర్, గూగుల్ పే, హెచ్ ఎఫ్ డీఎఫ్సీ, వరుణ్ మోటార్స్, లాంటి ఐటీ ఫార్మా కంపెనీలతో పాటు బ్యాంకింగ్‌ సంస్థలు కూడా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకున్నాయి. నెలకు కనీసం రూ.20 వేలు మొదలుకుని రూ. 40వేల జీతంతో సుమారు 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామక పత్రాలు అందజేశారు.

యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సుభాష్ రెడ్డి సూచించారు. శ్రద్ధాసక్తులతో విద్యాభ్యాసం పూర్తి చేసి భవిష్యత్‌పై ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ పడాలన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మెదక్ నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివచ్చి ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. రక్త దానశిబిరం నిర్వహించారు. భారీగా యువత మెదక్ కు తరలి రావడంతో రోడ్డు లు కిక్కిరిసి పోయాయి.