మెటా ఉద్యోగులపై ‘లేఆఫ్స్‌ కత్తి..! మరోసారి భారీగా కోతలకు రంగం సిద్ధం..!

మెటా ఉద్యోగులపై ‘లేఆఫ్స్‌ కత్తి..! మరోసారి భారీగా కోతలకు రంగం సిద్ధం..!

విధాత‌: మరోసారి మెటా ఉద్యోగులపై లేఆఫ్స్‌ కత్తి వేలాడుతున్నది. వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృ సంస్థ అయితన మెటాలో మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, ఇటీవల ఉద్యోగుల తొలగింపును నిలిపివేశాయి. అయితే, మెటా భారీగా కోత విధించనున్నదనే వార్తలు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే, గతేడాది నవంబర్‌ నుంచి 21వేల మందికిపైగా ఉద్యోగులను మెటా తొలగించింది.



తాజాగా మిప్‌మేకింగ్‌ యూనిట్‌లో ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ సిద్ధమవుతుందని రాయిటర్స్‌ పేర్కొంది. మూడు విడుతల్లో ఉద్యోగుల్లో కోత విధించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఆగ్మెంటెడ్‌, వర్చువల్ రియాలిటీ ఉత్పత్తుల ప్రాజెక్ట్‌ను ప్రభావితం ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.



ఫేస్‌బుక్ ఎజైల్ సిలికాన్ టీమ్, ఫాస్ట్ టీంలో ఉద్యోగులను తొలగించాలని కంపెనీ భావిస్తుండగా.. ఇప్పటికే కంపెనీ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బాధితులకు సమాచారం అందిందని నివేదిక పేర్కొంది. దాదాపు 600 మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ బుధవారం వరకు పూర్తి చేసే అవకాశం ఉందని రాయిటర్స్‌ తెలిపింది.



అయితే, ఈ విషయాన్ని మెటా మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. కృత్రిమ మేధస్సు పనిపై దృష్టి కేంద్రీకరించిన మెటాలోని చిప్ మేకింగ్ యూనిట్‌ కష్టాల్లో పడగా.. దానికి బాధ్యత వహించిన ఎగ్జిక్యూటివ్‌ సైతం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మెటా క్వెస్ట్‌ తదితర మిశ్రమ రియాలిటీ హెడ్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తుంది.



ఇవి వర్చువల్‌ అసిస్టెంట్‌ ద్వారా వీడియోను ప్రసారం చేయగలవు. వాటిని ధరించిన వారితో కమ్యూనికేషన్‌ చేయగలవని కంపెనీ పేర్కొంది. కంపెనీ సాధారణ కళ్లద్దాలను పోలి ఉండే సరళమైన డిజైన్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఎఆర్‌ గ్లాసెస్, స్మార్ట్‌వాచ్‌లపై సైతం మెటా పని చేస్తుంది.



అయితే, మెటా తన డివైజెస్‌ పనితీరు, సామర్థ్యాన్ని పెంచేందుకు కస్టమ్‌ చిప్‌ల రూపకల్పనపై దృష్టి సారించింది. అభివృద్ధి చెందుతున్న ఏఆర్‌, వీఆర్‌ మార్కెట్‌లో సవాళ్లను ఎదుర్కొటుంది. ప్రస్తుతం చిప్‌లను ఉత్పత్తి చేసేందుకు చిప్‌మేకర్‌ Qualcomm వైపు మొగ్గు చూపింది.


ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే అమెజాన్‌, ట్విట్టర్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలతో పాటు బైజూస్‌తో పాటు పలు కంపెనీలు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.