నరేష్, రమ్య, పవిత్ర: ఓ ముగింపు లేని సమరం.. నడిచేనా యుగాంతం!
విధాత, సినిమా: సీనియర్ నరేష్ ఎప్పుడు వివాదాలతో ఉంటారు. ఆయన నిజజీవితం నిత్యం వివాదాల మయం. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం, షష్టి పూర్తి వయసులో ఒకరితో సహజీవనం చేయడం.. ఆమె కోసం దేనికైనా తెగించేందుకు ఆయన చూపిస్తున్న ఉత్సాహం చూస్తున్న వారికి ఆశ్చర్యాన్ని, నవ్వును, సిగ్గు వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ జంట సహజీవనం చేస్తుంది. అయితే మూడో భార్య రమ్యా రఘుపతి మాత్రం ఎదురు తిరిగింది. విడాకులు ఇచ్చే ప్రశ్న లేదని.. తాను […]

విధాత, సినిమా: సీనియర్ నరేష్ ఎప్పుడు వివాదాలతో ఉంటారు. ఆయన నిజజీవితం నిత్యం వివాదాల మయం. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం, షష్టి పూర్తి వయసులో ఒకరితో సహజీవనం చేయడం.. ఆమె కోసం దేనికైనా తెగించేందుకు ఆయన చూపిస్తున్న ఉత్సాహం చూస్తున్న వారికి ఆశ్చర్యాన్ని, నవ్వును, సిగ్గు వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ జంట సహజీవనం చేస్తుంది.
అయితే మూడో భార్య రమ్యా రఘుపతి మాత్రం ఎదురు తిరిగింది. విడాకులు ఇచ్చే ప్రశ్న లేదని.. తాను విడాకులివ్వకుండా మీరు ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తానని తేల్చి చెప్పింది. గతంలో ఈమె విజయనిర్మల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది.
నరేష్, రమ్య రఘుపతి 2010లో వివాహం చేసుకోగా వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. మనస్పర్ధలతో చాలా కాలం క్రితమే వీరు విడిపోగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. నరేష్ విడిపోవాలని కోరుకుంటుండగా.. ఆమె మాత్రం అంగీకరించడం లేదు.
రమ్యతో విడిపోయిన నరేష్.. నటి పవిత్ర లోకేష్‌కి దగ్గరై దాదాపు నాలుగేండ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. రీసెంట్‌గా పవిత్రతో నరేష్ పెళ్లికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చేశారు. పవిత్ర లోకేష్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు తెలిపారు.
దీంతో రమ్య రఘుపతి నాకు విడాకులివ్వకుండా మరొక మహిళతో వివాహం ఎలా చేసుకుంటావు? అని ఎదురుతిరిగింది. పైగా ఆమె తెలివిగా నా కుమారుడు తండ్రి కావాలంటున్నాడు కాబట్టి విడాకులివ్వను. మా మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించమని మాత్రమే నేను కోర్టుకి వెళ్తానంటూ ఆమె తెలివిగా తన పద్దతిలో అడుగు వేస్తోంది. నా బిడ్డ భవిష్యత్తు కోసం నరేష్‌కి విడాకులు ఇచ్చేదే లేదని చెప్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆరోపణల పర్వం తారా స్థాయికి చేరుకున్నాయి.
కృష్ణగారితో అక్రమ సంబంధం అంటగట్టాడు: నరేష్‌పై రమ్య సంచలన ఆరోపణలు
ఇక నరేష్ ఇటీవల రమ్య బ్లాక్ మెయిలింగ్ చేస్తోందని, నా ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తోందని, ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ తనపై రెక్కి నిర్వహించాడని నరేష్ ఎదురు దాడికి దిగాడు. కేవలం తన ఆస్తి కోసమే కలిసి ఉండాలని చెబుతోంది గాని ఆమెకు సంసారం చేసే ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు.
తాజాగా నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. గుర్తు తెలియని వ్యక్తులు గచ్చిబౌలిలో గల తన నివాసం వద్ద రాళ్లు రువ్వారని, కారు, కారవాన్, ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. దీంతో.. అసలు నరేష్ ఇంటిపై ఎవరు దాడి చేశారు? అనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తుందన్న రమ్య తన ఇంటిపై దాడి చేయించిందని నరేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయితే నరేష్ ఇంటిపై రాళ్ల దాడి చేయించడం వల్ల రమ్యకు ఒరిగేదేముంది. అయినా నరేష్‌ని హత్య చేయాలనుకుంటే ఇళ్లపై దాడులు చేయరు కదా అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
రమ్యని ఎదుర్కొలేక.. నరేషే ఇలా అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, నరేష్‌కు ఉన్న అతి తెలివి ‘మా’ ఎన్నికలప్పుడే బయటపడిందనేలా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, రమ్య రఘుపతిని ఇబ్బందుల్లోకి నెట్టేయాలని.. ఆయనే తన ఇంటిపై రాళ్లు వేయించుకుని ఉంటాడనేలా కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.