ఆదాని చేతికి NDTV.. వ్యవస్థాపక డైరెక్టర్ ప్రణయ్ రాయ్ రాజీనామా!
విధాత: దేశంలోని ప్రసార మాధ్యమాలు మెల్లగా కార్పొరేట్స్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయ్. ఇప్పటికే న్యూస్-18 సంస్థలోని పలు న్యూస్ ఏజెన్సీలు, చానెళ్లు అంబానీ చేతిలోకి వచ్చేయగా తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ న్యూఢిల్లీ టెలివిజన్(ఎన్డీటీవి) ఇంకో గుజరాతీ వ్యాపారి గౌతమ్ ఆదాని చేతిలోకి వచ్చింది. ఎన్డీటీవికి చెందిన మెజారిటీ షేర్లు ఆదాని కొనుగోలు చేయడంతో సంస్థ ఏకంగా ఆదాని పరమైంది. దీంతో చేసేదేమీ లేక వ్యవస్థాపక డైరెక్టర్ ప్రణయ్ రాయ్ ఎన్డీటీవి నుంచి వైదొలిగారు. ఆయన సతీమణి రాధికా […]

విధాత: దేశంలోని ప్రసార మాధ్యమాలు మెల్లగా కార్పొరేట్స్ గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయ్. ఇప్పటికే న్యూస్-18 సంస్థలోని పలు న్యూస్ ఏజెన్సీలు, చానెళ్లు అంబానీ చేతిలోకి వచ్చేయగా తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ న్యూఢిల్లీ టెలివిజన్(ఎన్డీటీవి) ఇంకో గుజరాతీ వ్యాపారి గౌతమ్ ఆదాని చేతిలోకి వచ్చింది.
ఎన్డీటీవికి చెందిన మెజారిటీ షేర్లు ఆదాని కొనుగోలు చేయడంతో సంస్థ ఏకంగా ఆదాని పరమైంది. దీంతో చేసేదేమీ లేక వ్యవస్థాపక డైరెక్టర్ ప్రణయ్ రాయ్ ఎన్డీటీవి నుంచి వైదొలిగారు. ఆయన సతీమణి రాధికా రాయ్ కూడా డైరెక్టర్‌గా రాజీనామా చేశారు.
ఎన్‌డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు. తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
దీంతో.. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ఆ వెను వెంటనే సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెకక్టర్స్ గా వచ్చి చేరారు.. ఇదిలా ఉండగా తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్ టేకోవర్ చర్యలు చేపట్టిందని ఎన్‌డీటీవి ఆరోపిస్తోంది.
లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్‌డీటీవీలో గౌతమ్ అదానీ తొలుత పరోక్షంగా వాటా దక్కించుకున్నారు. ఇందు కోసం ఎన్‌డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేశారు. తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది.
అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. అదానీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. ఇందుకోసం రూ.493 కోట్లు వెచ్చించనున్నాయి. NDTVకి చెందిన 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటీ రూ.294 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపాయి