Viral Video | చదువు చెప్పే పద్ధతిదేనా?.. ఓ తల్లిపై నెటిజన్ల ఫైర్‌..!

Viral Video | పిల్లలకు చదువు చెప్పే పద్ధతి ఇదేనా అంటూ నెటిజన్లు ఓ తల్లిపై ఫైర్‌ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ తల్లి తన కొడుకుతో హోం వర్క్‌ చేయిస్తున్నది. అయితే, చిన్నారి భయపడుతూ హోంవర్క్‌ చేయడం కనిపిస్తున్నది. ఒకటి నుంచి పది వరకు అంకెలను లెక్కించే క్రమంలో తల్లి తనను ఎక్కడ కొడుతుందోనని భయం ఆ చిన్నారిలో కనిపించింది. దీంతో నెటిజన్లు తల్లిపై ఆగ్రహం వ్యక్తం […]

Viral Video | చదువు చెప్పే పద్ధతిదేనా?.. ఓ తల్లిపై నెటిజన్ల ఫైర్‌..!

Viral Video | పిల్లలకు చదువు చెప్పే పద్ధతి ఇదేనా అంటూ నెటిజన్లు ఓ తల్లిపై ఫైర్‌ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ తల్లి తన కొడుకుతో హోం వర్క్‌ చేయిస్తున్నది.

అయితే, చిన్నారి భయపడుతూ హోంవర్క్‌ చేయడం కనిపిస్తున్నది. ఒకటి నుంచి పది వరకు అంకెలను లెక్కించే క్రమంలో తల్లి తనను ఎక్కడ కొడుతుందోనని భయం ఆ చిన్నారిలో కనిపించింది. దీంతో నెటిజన్లు తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద‌న్ ద్వివేది అనే యూజ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. వీడియో వైరల్‌గా మారింది. అయితే, ఆమె కోపం చ‌ల్లార్చేందుకు బాలుడు త‌ల్లికి ముద్దివ్వడం క‌నిపించింది. వీడియో చివ‌రిలో బాలుడిని త‌ల్లి ఎందుకు ఏడుస్తున్నావ‌ని అడుగుతూ కన్నీళ్లను తుడిచింది.

ఈ వీడియో చూసిన జనం అసంతృప్తితో ర‌గులుతూ మీరంటే.. ఎందుకు మీ కొడుకు అంత‌లా భ‌య‌ ప‌డుతున్నాడని ప్రశ్నించారు. అస‌లు చ‌దువు చెప్పే తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి ఈ వీడియో ఆరు మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.