Nithin’s ‘Thammudu’| నితిన్ ‘తమ్ముడు’ సేఫ్ జోన్ లోనే?

విధాత : దిల్ రాజు బ్యానర్ లో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా..లయ రీ ఎంట్రీతో వస్తున్న ‘తమ్ముడు’ సినిమా విడుదలకు ముందే ఆర్థికంగా సేఫ్ జోన్ కు దగ్గరగా వెళ్లిందా అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కాతమ్ముడు అనుబంధం నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ అక్కగా లయ కీలక పాత్ర పోషించారు. సప్తమీ గౌడ హీరోయిన్. ఈ సినిమా జులై 4న బాక్సాఫీసు ముందుకు రానుంది. అయితే దిల్ రాజు బ్యానర్లో వచ్చిన సినిమాల ఓటీటీ హక్కులన్నీ సాధారణంగా అమేజాన్కే అమ్ముతారు. తొలిసారి ‘తమ్ముడు’ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ చేతిలో పెట్టారు దిల్ రాజు. శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకొంది. ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాటిలైట్, ఆడియో రైట్స్…ఇలా నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి రూ.38 కోట్లు వచ్చాయి. సినిమా బడ్జెట్ అటూ ఇటుగా రూ.75 కోట్లయ్యిందట.
టాక్ బాగుంటే మిగిలిన మొత్తం రాబట్టుకోవడం అంత కష్టమేం కాదంటున్నారు సినీ నిపుణులు. మొత్తానికి ‘తమ్ముడు’ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్టే లెక్క అన్న అంచనాలు నెలకొన్నాయి. చూడాలిమరి..విడుదల తర్వాతా తమ్ముడు ఎంతమేరకు బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ విశ్లేషకులు. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇటీవల ఇంటర్వ్యూలో తమ్ముడు సినిమా బడ్జెట్ తొలుత 35 కోట్ల రూపాయలకే అంచనా వేశామని చెప్పారు. కానీ చివరికి అది రూ.75 కోట్ల వరకు చేరుకుందని తెలిపారు. ఇక ఆ కథ అలా డిమాండ్ చేసిందని, దానికి ఆ బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందని వివరించారు. దీంతో ఈ చిత్రం బడ్జెట్..వసూళ్లపై ఆసక్తి పెరిగింది.