ప్యాకేజ్డ్ ఫుడ్‌తో ఊబకాయం
రుచిగా ఉందని, వంటకం ఈజీ అని, టైపాస్ అని ప్యాకేజ్డ్ ఫుడ్ ఇష్టంగా తింటున్న పట్టణ భారతీయులు బరువెక్కిపోతున్నారు

- బరువెక్కుతున్న అర్బన్ ఇండియన్స్
- ముగ్గురికిలో ఒకరికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్
- 60 శాతానికిపైగా పట్టణ భారతీయులు అధిక బరువు
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీలో వెల్లడి
విధాత: రుచిగా ఉందని, వంటకం ఈజీ అని, టైపాస్ అని ప్యాకేజ్డ్ ఫుడ్ ఇష్టంగా తింటున్న పట్టణ భారతీయులు బరువెక్కిపోతున్నారు. హైదరాబాద్ సహా పట్టణ భారతీయులు స్వీట్లు, మిక్చర్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. సగటు పట్టణ భారతీయుడు రోజుకు కనీసం 100 గ్రాముల ప్యాక్ చేసిన ఆహారాన్ని తింటున్నాడు. ఇది రోజుకు 500 కిలో క్యాలరీల శక్తిని అందిస్తున్నది. ఇది శరీర అవసరానికి మించి ఉండటం వల్ల లావైపోతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పట్టణ ప్రజల ఆహార అలవాట్లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.
అధిక శక్తినిచ్చే ఆహారం తినడం, శారీరక శ్రమ లేని కారణంగా నగరాల్లో ప్రజలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు. పట్ణణాలతోపాటు గ్రామీణ ప్రజలు కూడా అధిక బరువు పెరుగుతున్నారు. రెండుచోట్ల ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇది 60 శాతాన్ని మించిపోయింది. “50 కిలో క్యాలరీలు/రోజుకు తగ్గ సానుకూల శక్తి అసమతుల్యత కూడా నెలవారీ బరువును కిలో వరకు పెంచుతుంది” అని ఎన్ఐఎన్ డాక్టర్ ఆర్ హేమలత తెలిపారు.
“ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం ఎంతో సులభం, మ్యాగీ వంటి వంటకం నిమిషాల్లో పని. ఎంతో రుచిగా ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అధికంగా కూడా తీసుకుంటారు. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD), డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ (CVD) వంటి డైట్-సంబంధిత నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) పెరగడానికి కారణమవుతున్నది. రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్‌లతో సహా అనారోగ్యాలు భారతీయులకు చిన్న వయస్సులోనే ఎటాక్ అవుతున్నాయి. భారతదేశంలోని ముగ్గురిలో ఒకరు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడుతున్నారు.
ఫుడ్ మార్కెట్‌లో చాక్లెట్, మిఠాయిలది అగ్రస్థానం. తరువాతి స్థానంలో ఇతర ఆహారాలు, పానీయాలు ఉన్నాయి. “అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్‌లో స్వీట్ బిస్కెట్లు మాత్రమే 45 శాతానికి పైగా ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో హెపాటిక్ ఇన్సులిన్ సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్‌కు అంతరాయం కలిగిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకత, మంట, మెటబాలిక్ సిండ్రోమ్ (మెట్‌ఎస్) లక్షణాలకు దారితీస్తుంది, ఇది ఎన్‌సీడీల పెరుగుదలకు దోహదం చేస్తుంది ”అని డాక్టర్ హేమలత తెలిపారు. దోపిడీ మార్కెటింగ్, ప్రకటనలను అరికట్టడం, ఆరోగ్యకరమైన ఎంపికలకు రాయితీలు, ఫుడ్ లేబులింగ్ వంటి చర్యల వల్ల మార్కెట్‌లో అనారోగ్యకరమైన ప్యాకెజ్డ్ ఫుడ్‌ను నివారించవచ్చని వెల్లడించారు.