యాదగిరిగుట్ట భక్తులకు ఆన్ లైన్ సేవలు
విధాత: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులకు అవసరమైన సేవలను ముందస్తుగా ఆన్లైన్లో టికెట్స్ పొందే విధంగా వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వీఐపీలు, వీవీఐపిలు, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వారి సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 టికెట్ తో ప్రస్తుతం బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. 150 రూపాయల టికెట్ తో శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు. వీటిని వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోను పొందవచ్చు. http://WWW.yadadritemple.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి భక్తులు తమకు కావలసిన […]

విధాత: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులకు అవసరమైన సేవలను ముందస్తుగా ఆన్లైన్లో టికెట్స్ పొందే విధంగా వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వీఐపీలు, వీవీఐపిలు, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వారి సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 టికెట్ తో ప్రస్తుతం బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. 150 రూపాయల టికెట్ తో శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు.
వీటిని వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోను పొందవచ్చు. http://WWW.yadadritemple.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి భక్తులు తమకు కావలసిన ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లను పొందవచ్చు. ఈహుండీ ద్వారా డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం 2023 టికెట్లను కూడా వెబ్సైట్లో పొందవచ్చు.
ఈ నెల 28వ తేదీన జరిగే బ్రహ్మోత్సవం కళ్యాణం టికెట్ ధర 3000 గా నిర్ణయించారు. ఆన్లైన్ బుకింగ్ లో భక్తుడి పేరు, గోత్రము , పూజా వివరాలు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, తేదీ ,ఎన్ని టికెట్లు ,అడ్రస్, ఆధార్ నెంబర్, ఆలయ సందర్శన వేళ, తదితర వివరాలు నింపాల్సి ఉంటుంది. శాశ్వత నిత్య పూజ 10 సంవత్సరాలకు 15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన 15వేలుగా నిర్ణయించారు.
అష్టోత్తర శతకటాభిషేకంకు 1000 రూపాయలు ,దర్బార్ సేవకు 516 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ 800 రూపాయలు, స్వర్ణ పుష్పార్చనకు 600, శయణోత్సవంకు 100 రూపాయలు, సుప్రభాత దర్శనంకు 100రూపాయలు టికెట్లుగా నిర్ణయించారు.
ద్విచక్ర వాహన పూజకు 300 రూపాయలు, ఆటో పూజకు 400 రూపాయలు, కారు పూజకు 500 రూపాయలు , బస్సు, లారీ, ట్రాక్టర్ పూజకు వెయ్యి రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. యాదాద్రిలో రాత్రి బస చేసే భక్తుల కోసం కొండ కింద లక్ష్మీ నిలయం నాన్ ఏసీ గదికి 560 రూపాయలు, లక్ష్మీ నిలయం నాన్ ఏసీ డీలక్స్ కు వెయ్యి రూపాయలుగా అద్దె నిర్ణయించారు.