Origin Dairy | రంగంలోకి CBI.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసిన శేజల్

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరిజన్ డైరీ (Origin Dairy) డైరెక్టర్ శేజల్ ఫిర్యాదు చేసింది. గత 15 రోజుల నుండి శేజల్ ఢిల్లీలోని ఉంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనకు చేసిన అన్యాయాలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంది. గత వారం రోజుల క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు పార్కింగ్ స్థలంలో […]

Origin Dairy | రంగంలోకి CBI.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసిన శేజల్

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరిజన్ డైరీ (Origin Dairy) డైరెక్టర్ శేజల్ ఫిర్యాదు చేసింది. గత 15 రోజుల నుండి శేజల్ ఢిల్లీలోని ఉంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనకు చేసిన అన్యాయాలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంది.

గత వారం రోజుల క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు పార్కింగ్ స్థలంలో దుర్గం చిన్నయ్య అనే ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని అతనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని నిరసన వ్యక్తం చేస్తూ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అనంతరం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు చిన్నయ్య పై ఫిర్యాదు చేసింది . జాతీయ మహిళా కమిషన్ కార్యాలయం నుండి తెలంగాణ డిజిపి కి ఆదేశాలు జారీ చేయబడ్డాయి దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు చేసి 15 రోజుల్లో నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో శేజల్ ఢిల్లీ సిబిఐ కార్యాలయానికి వెళ్లి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఫిర్యాదు చేసింది. దుర్గం చిన్నయ్య తమను లైంగికంగా వేధిస్తున్నడని , అతని అనుచరులు చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

ఆరిజన్ డైరీ నిర్మాణం కోసం 30 లక్షలు తీసుకొని ప్రభుత్వ భూమి చూపించి మోసం చేశాడని తెలిపారు. తమకు అన్యాయం చేశాడని, మా సంస్థ వద్ద అక్రమంగా డబ్బులు తీసుకుని అతడే మాపై అక్రమ కేసులు మోపి జైలుకు పంపారని అతనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదన్నారు.

ఎమ్మెల్యే తన అధికార దర్పాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని లేఖలో తెలిపింది . గతంలో ఆరిజన్ డైరీ డైరెక్టర్ శేజల్ హైదరాబాదులోని సచివాలయంతో పాటు అనేక ప్రాంతాల్లో నిరసన ఫ్లెక్సీలు ప్రదర్శించింది.

తెలంగాణ రాష్ట్రంలో తమకు న్యాయం జరగడం లేదని ఏకంగా ఢిల్లీ నూతన పార్లమెంట్ ముందు ప్లెక్సీలతో బాధితురాలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో తమకు ప్రాణహాని ఉందని శేజల్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని నూతన పార్లమెంటు భవన్ ఎదుట ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు .

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో ఆరిజిన్ డెయిరీ సంస్థ బెల్లంపల్లిలో ప్రారంభించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్య వాటా అడిగితే ఇచ్చామని శేజల్ వెల్లడించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత ఏడాది ఆగస్టు 8వ తేదీన ఆరిజన్ డైరీ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని అప్పజెప్పి తమ వద్ద నుండి అక్రమంగా 30 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే చిన్నయ్య , తనను లైంగికంగా వేధిస్తున్నాడని అలాగే అమ్మాయిలను పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడని శేజల్ ఆరోపించారు. ఆ పనికి నేను నిరాకరించడంతో మాపై కక్ష పెంచుకొని తనతోపాటు తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులను పెట్టించి జైలుకు పంపారని బాధితురాలు శేజల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని సిబిఐ దర్యాప్తు సంస్థకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.