తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో సంఘం క్రియాశీల భూమిక

తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో సంఘం క్రియాశీల భాగస్వామ్యం, భూమిక పోషించిందని ప్రొఫెసర్ జీ. హరగోపాల్ ప్రశంసించారు

  • Publish Date - February 13, 2024 / 12:21 PM IST

  • ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు చొరవ చూపాలి
  • టీఎన్జీవో డైరీ ఆవిష్కరణలో ప్రొఫెసర్ జీ. హరగోపాల్‌


విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో సంఘం క్రియాశీల భాగస్వామ్యం, భూమిక పోషించిందని ప్రొఫెసర్ జీ. హరగోపాల్ ప్రశంసించారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో జరిగిన టీఎన్జీవో కేంద్ర సంఘం 2024 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవో ఉద్యమ ప్రస్థానం చారిత్రాత్మకంగా ఉందని, ఉద్యోగులు ప్రజల కోసం పని చేస్తే ఉద్యోగుల హక్కుల సాధన ఉద్యమంలో ప్రజలు తమ వెంట ఉంటారని, నూతన ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ముందుకు రావాలని కోరారు.


అలాగే, ప్రభుత్వాలు మారితే ఉద్యోగులకు రాజకీయ పార్టీల రంగును అంటకట్టడం సరికాదని, ఉద్యమ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాలు చేశారని అందుకు పార్టీలతో సాన్నిహిత్యం ఉండటం సహజం కనుక టీఎన్జీవో లకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కనుక నూతన ప్రభుత్వంతో ఉద్యోగుల సమస్యల సాధనలో తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.


సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ మాట్లాడుతూ 75 సంవత్సరాల టీఎన్జీవో సంఘం చరిత్రలో దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంతో, 20 ఏండ్లు తెలుగు దేశంతో, 10ఏండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉద్యోగుల హక్కుల సాధన కోసం కలిసి పనిచేశామన్నారు.


అయితే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పని చెయ్యలేదని, ఉద్యోగులుగా రాజకీయ పార్టీ భావజాలం ఉండటం వ్యక్తిగతమని, మొత్తం సంఘం గంప గుత్తగా ఏ రాజకీయ పార్టీ జెండా మోయాలేదన్నారు. గత 10ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పని చేసినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షలు నేరవెరందునా పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు తమ అభిప్రాయాల మేరకు నూతన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని, కానీ కొందరు టీఎన్జీవో సంఘం చరిత్రను మసకబారేలా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.


లక్షలాది ఉద్యోగులు సభ్యులుగా కలిగిన టీఎన్జీవో సంఘం ఐక్యంగా కుట్రలను చేదిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాకా ఇప్పటికీ నాలుగు సార్లు టీఎన్జీవో సంఘం కలవడం జరిగిందన్నారు. త్వరలో ఉద్యోగ సంఘం నేతలను పిలిచి సమస్యలపై సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందున వారికి కృతజ్ఞతలు తెయజేస్తునామని, ప్రజల ప్రభుత్వానికి టీఎన్జీవో సంఘం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


ఈ డైరీ ఆవిష్కరణ సభలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, కోశాధికారి శ్రీనివాస రావు, అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, అశోక్, రంగారెడ్డి లక్ష్మణ్, బర్చిరెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, విక్రమ్,నగర శాఖ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్ హరికృష్ణ, నల్లగొండ శ్రావణ కుమార్, కిరణ్, నిజామాబాద్ కిషన్, శేఖర్, హనుమకొండ రాజేందర్, సోమన్న, వరంగల్ రాంకిషన్, ఖమం అఫ్జల్ సాగర్, కరీంనగర్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ రావు, మెదక్ నరేందర్, రాజ్కుమార్, మేడ్చల్ రవి ప్రకాష్ మరియు 33 జిల్లా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Latest News