భూ కబ్జాదారుల నుంచి రక్షించండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటం!
న్యాయం జరగకుంటే కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడతాం.. మా ఆత్మహత్యలకు నాగేశ్వరరావు, ఉప్పలయ్య, సత్యనారాయణే కారణం.. అదనపు కలెక్టర్‌కు మల్లికార్జున్ వినతి విధాత: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్‌కి గురువారం కబ్జాదారుల నుంచి మా భూములు రక్షించి మాకు అప్పజెప్పాలని బెడద మల్లికార్జున్ వినతిపత్రం అందజేశారు. వివరాళ్లోకి వెళఙతే.. కురవి మండలం కురవి రెవెన్యూ గ్రామంలో ఉన్న భూమి సర్వే నెంబరు 161/ఏ లో 2 ఎకరాలు, సర్వేనెంబర్ 283/b లో ఎ 1:20 […]

- న్యాయం జరగకుంటే కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడతాం..
- మా ఆత్మహత్యలకు నాగేశ్వరరావు, ఉప్పలయ్య, సత్యనారాయణే కారణం..
- అదనపు కలెక్టర్‌కు మల్లికార్జున్ వినతి
విధాత: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్‌కి గురువారం కబ్జాదారుల నుంచి మా భూములు రక్షించి మాకు అప్పజెప్పాలని బెడద మల్లికార్జున్ వినతిపత్రం అందజేశారు. వివరాళ్లోకి వెళఙతే.. కురవి మండలం కురవి రెవెన్యూ గ్రామంలో ఉన్న భూమి సర్వే నెంబరు 161/ఏ లో 2 ఎకరాలు, సర్వేనెంబర్ 283/b లో ఎ 1:20 గుంటల భూమి మా తండ్రి బెడద కృష్ణమూర్తి పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు వారసత్వంగా వచ్చిన ఆ భూములను కొంతమంది భూకబ్జాదారులు ఎర్ర నాగేశ్వరరావు, వారి అనుచరులు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, ప్రలోభాలకు గురి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసుకున్నారు.
ఈ విషయంలో తాను 2012లో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఎర్ర నాగేశ్వరరావుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం క్యాన్సిల్ చేయాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అప్పటి ఆర్టీవో అతనికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం క్యాన్సిల్ కూడా చేశారు. కానీ మళ్లీ అతను అధికారులను ప్రలోభ పెట్టి, లంచాలు ఇచ్చి తన పేరు మీద పాస పుస్తకం తయారీ చేయించుకున్నారు.
ఈ భూవివాదం మహబూబాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో O.S నంబర్ 191/2012 , IA నెంబర్ 774/2022, 775/2022 కోర్టులో దావా నడుస్తుండగా.. తన అనుచరులైన మాచర్ల ఉప్పలయ్య, కానిగంటి సత్యనారాయణకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈ విషయంలో కురవి తాహసీల్దార్ కు కూడా వినతి పత్రం అందజేసినా కూడా రెవెన్యు అధికారులు ప్రలోభాలకు లోనై భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారు. కానీ మేము ఇచ్చే దరఖాస్తులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు మా కుటుంబ సభ్యులకు ఆ భూమి జీవనాధారం. కానీ, ఆ భూమి కోర్టు వివాదంలో ఉన్నందున మేము జీవనోపాధి కోసం హైదరాబాదు వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాం. మేము లేని సమయంలో ఎర్ర నాగేశ్వరరావు, మాచర్ల ఉప్పలయ్య, కానిగంటి సత్యనారాయణ, వారి అనుచరులు మా భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మా భూమికి రక్షణ కల్పించాలని లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆత్మహత్యలకు ఎర్ర నాగేశ్వరరావు, మాచర్ల ఉప్పలయ్య, కానిగంటి సత్యనారాయణ బాధ్యత వహించాలని చెప్పారు. ఇకనైనా భూ కబ్జాదారుల నుండి మా భూమిని, మా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు.