సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద రాజాసింగ్ హల్ చల్.. బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలేసేందుకు యత్నం
విధాత: సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద శుక్రవారం ఎమ్మెల్యే రాజాసింగ్ హల్ చల్ చేశారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ రిపేర్లకు గురవుతుందన్న అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ ఆ వాహనాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వదిలేసేందుకు వచ్చారు. గమనించిన పోలీసులు రాజాసింగ్‌ని అదుపులోకి తీసుకొని డీసీఎంలో ఆయనను అక్కడి నుంచి తరలించారు. సీఎం కేసీఆర్ తనకు పాడైన బులెట్ ప్రూఫ్ కారును ఇచ్చారని, ఇటీవల తన కారు టైరు పేలి పోగా, […]

విధాత: సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద శుక్రవారం ఎమ్మెల్యే రాజాసింగ్ హల్ చల్ చేశారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ రిపేర్లకు గురవుతుందన్న అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ ఆ వాహనాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వదిలేసేందుకు వచ్చారు.
గమనించిన పోలీసులు రాజాసింగ్‌ని అదుపులోకి తీసుకొని డీసీఎంలో ఆయనను అక్కడి నుంచి తరలించారు. సీఎం కేసీఆర్ తనకు పాడైన బులెట్ ప్రూఫ్ కారును ఇచ్చారని, ఇటీవల తన కారు టైరు పేలి పోగా, అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని, ఆ కారును వాపస్ తీసుకొని కొత్తది ఇవ్వమని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్న అసంతృప్తితో నిరసనతో ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పాడైన కారును వదిలేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.
ప్రగతిభవన్ దగ్గర రాజాసింగ్హల్చల్.. అరెస్ట్ | Raja Singh | Pragathi Bhavan – TV9#RajaSingh #PragathiBhavan #TV9Telugu pic.twitter.com/uF4TC0M229
— TV9 Telugu (@TV9Telugu) February 10, 2023