ఖర్గే వాఖ్యలపై దద్ధరిల్లిన రాజ్య సభ.. క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం.. బల్లలు ఎక్కి నిరసన 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారని చైర్మన్ ఆగ్రహం వాకౌట్ చేసిన కాంగ్రెస్ క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేసిన ఖర్గే విధాత: స్వాతంత్ర్య ఉద్యమంలో దేశం కోసం బీజేపీ ఒక్కశునకాన్ని కూడ కోల్పోలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. ఉదయం రాజ్యసభ కార్యకలాపాలు మొదలు కాగానే ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ […]

- అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం.. బల్లలు ఎక్కి నిరసన
- 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారని చైర్మన్ ఆగ్రహం
- వాకౌట్ చేసిన కాంగ్రెస్
- క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేసిన ఖర్గే
విధాత: స్వాతంత్ర్య ఉద్యమంలో దేశం కోసం బీజేపీ ఒక్కశునకాన్ని కూడ కోల్పోలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. ఉదయం రాజ్యసభ కార్యకలాపాలు మొదలు కాగానే ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
సభ బయట చేసిన వ్యాఖ్యలకు లోపల క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీంతో సభలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు పట్టు బట్టారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొంత మంది సభ్యులు బల్లలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే జోక్యం చేసుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ వారించే ప్రయత్నం చేశారు.
ప్రజలు నవ్వుకుంటున్నారన్న చైర్మన్..
మనల్నిచూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటున్నారని రాజ్య సభ చైర్మన్ జగదీప్ దన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ వెలుపల ఖర్గే చేసిన వ్యాఖ్యలపై సభలో ఆందోళనలు సరికాదని చెప్పినా వినిపించుకోకుండా బీజేపీ సభ్యులు ఆందోళన చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు.
పార్లమెంటు వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో ఆందోళనలు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్షాల మధ్య అభిప్రాయబేధాలు ఉండొచ్చు కానీ ఇది పద్ధతి కాదన్నారు. రాజ్య సభ పక్ష నేత మాట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్ష ఎంపీలు ఆటంకం కలిగించడం, ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మరో పక్షం ఆటంకం కలిగించడం పద్దతి కాదన్నారు. మనం పిల్లలం కాదని, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గౌరవ సభ్యులమని హితవు పలికారు.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని క్షమాపణ అడుగుతారా?
పార్లమెంటు బయట బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చజరగాల్సిన అవసరం లేదని రాజ్య సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. తాను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
దేశ స్వాతంత్య్రంకోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతారా? అని బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. అనంతరం ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. లోక్ సభలోనూ ఖర్గే వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.