సోనియా, రాహుల్‌, ప్రియాంకగాంధీలతో ముగిసిన రేవంత్‌ భేటీ

తెలంగాణ సీఎంగా ఎంపికైన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు

సోనియా, రాహుల్‌, ప్రియాంకగాంధీలతో ముగిసిన రేవంత్‌ భేటీ

విధాత : తెలంగాణ సీఎంగా ఎంపికైన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. సీఎంగా తన పదవీ ప్రమాణా స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించారు. అందుకు వారు తమ సమ్మతిని తెలిపినట్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాల సమాచారం.


అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌లను రేవంత్‌ కలిశారు. వారందరిని సీఎంగా తన ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అలాగే మంత్రివర్గం కూర్పులో అనుసరించాల్సిన అంశాలపై కూడా వారి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తుంది.


మరోవైపు సీఎం పదవిని ఆశీంచిన సీనియర్లు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఢిల్లీలోనే ఉన్న పరిశీలకుడు డీకే.శివకుమార్‌తో భేటీ కావడం ఆసక్తి రేపింది. మంత్రివర్గం కూర్పులో తమ అభిప్రాయలను డీకేకు వివరించినట్లుగా తెలుస్తుంది. రేవంత్‌, ఉత్తమ్‌, భట్టిలు ఢిల్లీలోనే ఉన్నప్పటికి వారు ముగ్గురు పరస్పరం బుధవారం మధ్యాహ్నం వరకు కూడా కలుసుకోకపోవడం గమనార్థం.