లోకేశ్‌ పాదయాత్రపై.. కారం జల్లుతున్న RGV

విధాత: ఎద్దు పుండు నొప్పి కాకికి ఏమి తెలుస్తుంది లెండి. పొడుచుకు తినడమే దాని టార్గెట్.. ఇప్పుడు ఆర్జీవి కూడా అలాగే తయారయ్యాడు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ, చంద్రబాబు లోకేష్ తదితరులను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రను అవహేళన చేస్తూ తరచూ ట్విట్టర్లో పోష్టులు పెడుతున్నారు. నిన్న అచ్చెన్నాయుడిని వెక్కిరించిన ఆర్జీవి తాజాగా లోకేష్‌ను కూడా ర్యాగింగ్ చేశారు. ఇప్పటికే జనం లేక, ఊపు లేక ఏదోలా సాగుతున్న […]

  • By: krs    latest    Feb 11, 2023 1:07 PM IST
లోకేశ్‌ పాదయాత్రపై.. కారం జల్లుతున్న RGV

విధాత: ఎద్దు పుండు నొప్పి కాకికి ఏమి తెలుస్తుంది లెండి. పొడుచుకు తినడమే దాని టార్గెట్.. ఇప్పుడు ఆర్జీవి కూడా అలాగే తయారయ్యాడు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ, చంద్రబాబు లోకేష్ తదితరులను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రను అవహేళన చేస్తూ తరచూ ట్విట్టర్లో పోష్టులు పెడుతున్నారు. నిన్న అచ్చెన్నాయుడిని వెక్కిరించిన ఆర్జీవి తాజాగా లోకేష్‌ను కూడా ర్యాగింగ్ చేశారు. ఇప్పటికే జనం లేక, ఊపు లేక ఏదోలా సాగుతున్న పాదయాత్ర మీద ఆర్జీవి కారం జల్లుతున్నారు.

మీకు పాదయాత్ర ఎందుకూ.. మానేయండి.. అసలు ఆ వాయిస్ రికార్డులను లీక్ చేసింది కూడా అచ్చెన్నాయుడు కావచ్చు.. అంటూ మొదలు పెట్టిన ఆర్జీవి ఇప్పుడు లోకేష్‌కు సలహాలు ఇస్తున్నారు.

మీరు ఎలాగూ యాత్ర చేయలేరు కానీ ఛాతీలో నొప్పి వచ్చిందనో.. కాలు లిగ్మెంట్ దెబ్బతిన్నదనో చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోండి. నడక ఆపేయండి..అదే మీకు మేలు అంటూ సలహాలు ఇచ్చారు.

పుండు మీద కారం చల్లుతున్నట్లు హాట్ కామెంట్లు విసురుతున్నారు. దీనికి అటు నుంచి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు సైతం గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నారు..

ఆడియో లీక్.. అచ్చెన్నకు తప్పని RGV ర్యాగింగ్!

వాళ్లు.. ప‌వ‌న్‌ని వెన్నుపోటు పొడుస్తారు: RGV

‘వారాహి’ని వదలని RGV.. పందితో పోలుస్తూ కామెంట్స్‌