సమంత జాతకం.. వామ్మో అన్ని పెళ్లిళ్లు చేసుకుంటుందా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సమంత ఏడాది పాటు సినిమాలకి దూరంగా ఉన్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. మయోసైటిస్ కారణంగా తనకి కాస్త విశ్రాంతి కావాలని భావించి సినిమాలు చేయడం తగ్గించింది.ఈ అమ్మడు తెలుగు సినిమాలతో పాటు తమిళ భాషలలోను నటించి అలరించింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించి మెప్పించిన ఈ చిన్నది వరుణ్ ధావన్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసింది.
ఇక గత కొద్ది రోజులుగా సల్మాన్‌తో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమైందనే టాక్ నడుస్తుంది. ఖుషి సక్సెస్ మీట్ సమయంలో ముంబై వెళ్లిన సమంత.. కరణ్ జోహార్‌తో కలిసి చర్చలు జరిపిందని, ఆమె సల్మాన్ సినిమాలో నటించేందుకు కథానాయికగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సమంత కెరీర్ పరంగా మంచిగానే ఉన్నా, పర్సనల్ లైఫ్ మాత్రం అభిమానులని కాస్త ఆందోళనకి గురి చేస్తుంది.

సమంత మొదట హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడి, అతడితో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంది. కాని ఏం జరిగిందో ఏమో కాని అతనికి బ్రేకప్ చెప్పింది. ఇక ఏ మాయ చేశావే సినిమా షూటింగ్ సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. 2017లో గోవా వేదికగా కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట 2021లో వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకొని సోలోగా ఉంటున్నారు. అయితే వీరిద్దరి రెండో పెళ్లి గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నా కూడా వాటిపై క్లారిటీ లేదు.

అయితే సమంత గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ అమ్మడి జాతకం ప్రకారం మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందట. మూడుసార్లు పెళ్లి అయినా ఆమెకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం ఉండదని, ఆమె జాతకం అలా ఉందని నెట్టింట ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తుంది. మరి దీనిపై సమంత ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక సమంత చివరిగా ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించాడు. చిత్రం ఇద్దరికి పెద్ద విజయం అందించింది.