రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీగా రైళ్లు రద్దు..!

దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సైతం ఉన్నాయి.

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీగా రైళ్లు రద్దు..!

Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సైతం ఉన్నాయి. విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. మచిలీపట్నం-విశాఖపట్నం (17219) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు రద్దు అయ్యింది. విశాఖపట్నం-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 30 నుంచి 26 ఫిబ్రవరి వరకు క్యాన్సిల్‌ అయ్యింది.


గుంటూరు- విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల 25 వరకు.. 17240 విశాఖపట్నం- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ- విశాఖపట్నం (17267) రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, విశాఖపట్నం- కాకినాడ (17268) రైలును ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 26 వరకు రద్దు అయ్యింది.


విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 22, 23, 24 తేదీల్లో విశాఖపట్నం- విజయవాడ ఉదయ్ (22701) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 22, 23, 24 తేదీల్లో అందుబాటులో ఉండదని చెప్పారు. గుంటూరు- రాయగడ (17243) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు రైలు విజయనగరం వరకు వెళ్తుంది. రాయగడ- గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్ రైలు 30 నుంచి ఫిబ్రవరి 26 వరకు రాయగడ నుంచి బదులుగా విజయనగరం నుంచి గుంటూరుకు తిరుగు ప్రయాణమవుతుంది.


వీటితో పలు పలు రైళ్లను దారి మళ్లించింది. మళ్లించిన రైళ్లన్నీ విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా నడువనున్నాయి. ఎర్నాకులం-పాట్నా (22643) ఎస్‌ఎఫ్‌ ఎక్స్‌ప్రెస్ జనవరి 22, 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో ఎర్నాకులం నుంచి దారి మళ్లించింది. ఎస్ఎంవీ బెంగళూరు-గౌహతి (12509) సూపర్‌ఫాస్ట్‌ ఈ నెల 24, 26, 31, ఫిబ్రవరి 2, 7,9, 14, 16, 21, 23 తేదీల్లో మళ్లించిన రూట్‌లో నడువనున్నది. సీఎస్‌టీ ముంబయి- భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్‌ప్రెస్ జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16,17, 19, 21, 23, 24 తేదీల్లో మళ్లించగా.. ఏలూరు, తాడేపల్లిగూడెం స్టాప్స్‌ను రద్దు చేశారు.


అలాగే మరికొన్ని రైళ్లను నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా మళ్లించింది. ధన్‌బాద్-అలెప్పీ (13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 29 నుంచి 25 ఫిబ్రవరి వరకు దారి మళ్లించింది. అలాగే తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్స్‌లో ఈ రైలు ఆగదు. టాటా-యశ్వంత్‌పూర్ (18111) ఎక్స్‌ప్రెస్ 1, 8, 15, 22 తేదీల్లో.. జసిదిహ్-తాంబరం (12376) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 31, ఫిబ్రవరి 7,14, 21 తేదీల్లో మళ్లించగా.. ఏలూర్‌ స్టాప్‌ను తొలగించింది.


హతియా-ఎర్నాకులం (22837) ఏసీ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో.. హతియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637) ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో మళ్లించింది. హతియా-ఎస్‌ఎంవీ (12835) బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 దారి మళ్లించింది. టాటా నగర్-ఎస్‌ఎంవీ (12889) బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.