ఢిల్లీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రికి తీవ్ర గాయాలు

విధాత : దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. గురువారం అర్ధ‌రాత్రి ద‌క్షిణ ఢిల్లీకి స‌మీపంలోని హోలీ ఫ్యామిలీ హాస్పిట‌ల్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రెండు స్టూడెంట్ గ్రూపుల మ‌ధ్య జ‌రిగిన తీవ్ర ఘ‌ర్ష‌ణ కార‌ణంగా కాల్పులు చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఎలాంటి ఉద్రిక్త వాతావ‌ర‌ణం లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ యువ‌కుడికి హోలీ ఫ్యామిలీ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల్లో రోగులు ఎవ‌రూ […]

ఢిల్లీలో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రికి తీవ్ర గాయాలు

విధాత : దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. గురువారం అర్ధ‌రాత్రి ద‌క్షిణ ఢిల్లీకి స‌మీపంలోని హోలీ ఫ్యామిలీ హాస్పిట‌ల్లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. రెండు స్టూడెంట్ గ్రూపుల మ‌ధ్య జ‌రిగిన తీవ్ర ఘ‌ర్ష‌ణ కార‌ణంగా కాల్పులు చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఎలాంటి ఉద్రిక్త వాతావ‌ర‌ణం లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ యువ‌కుడికి హోలీ ఫ్యామిలీ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల్లో రోగులు ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.